దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ హాజరు కావడంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఆ సభలో వైసీపీ నేత అంబటి రాంబాబుతో ఉమ సన్నిహితంగా ఉండటం, చంద్రబాబు ఆదేశాలు బేఖాతరు చేసి వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవడంపై టీడీపీ హై కమాండ్ సీరియస్ అయింది.
ఈ కోరికనే ఈ రోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, కిలారు రాజేష్ లతో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీని కలిసి బోండా ఉమ వివరణ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇకపై నేతలు హాజరయ్యే కార్యక్రమాలకు తాను హాజరు కాబోనని బోండా ఉమ స్పష్టం చేశారు. తాను పాతికేళ్లుగా పార్టీలో ఉన్నానని, ఏనాడూ పార్టీ లైన్ దాటలేదని అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలు ధిక్కరించేలా ఏరోజూ ప్రవర్తించలేదని, ప్రవర్తించబోనని చెప్పారు. 2019-24 మధ్యకాలంలో ప్రాణాలొడ్డి పార్టీని కాపాడుకునేందుకు ఏ విధంగా పనిచేశానో అందరికీ తెలుసు, అందుకు మీడియా కూడా సాక్షి అని చెప్పారు.
ముద్రగడ సంస్మరణ సభ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు తన దగ్గరకు వచ్చి పలకరించారని, మాట్లాడుకున్నామని అన్నారు. అది వాస్తవమేనని, బహిరంగ వేదికపైనే ప్రకటించారు. కాపు జేసీ ఆ కార్యక్రమం చేశారు, తనను ఆహ్వానించారు కాబట్టి అన్ని పార్టీలకు చెందిన నేతలతో పాటు వేదికను పంచుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
కానీ, ఆ విషయం గురించి సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది, ట్రోలింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన మాటలను వక్రీకరించారని, అక్కడ జరిగిన కలయిక వేరని చెప్పారు. ఈ విషయమే కమిటీ ముందు వివరించానని అన్నారు.

