సెప్టెంబర్లో భవనం శిథిలావస్థకు చేరడంతో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామపంచాయతీ గోపాలపురం ప్రాథమిక పాఠశాలకు విద్యాశాఖ అధికారులు తాళం వేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన తరగతి 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలలు అద్దె భవనంలో తరగతులు నిర్వహించిన ఉపాధ్యాయులు, తర్వాత సొంతంగా రూ.40 వేలతో రేకుల షెడ్ నిర్మించి కొనసాగుతున్నారు.
తాగునీరు, స్టేషనరీ వంటి అవసరాలు కూడా కాంపోజిట్ గ్రాంట్తోనే ఉంటామని ఉపాధ్యాయురాలు ఇందిర. కొత్త భవనం కోసం అధికారులను కోరితే తమ పరిధిలో లేదని, ఎంపీడీవోలను కలవాలని సూచించారని చెప్పారు. వర్షం పడితే షెడ్లలో తరగతులు నిర్వహించలేక స్కూల్కు సెలవు ప్రకటించాల్సిన పరిస్థితి. వెలుగు, ఖమ్మం ఫొటోగ్రాఫర్

