కేంద్ర ఎన్నిక సంఘం ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ.. విద్యార్థులకు పాఠంగా మారనుంది. ఎన్ సీఆర్ టీ అనుమతిని పాఠ్యపుస్తలో దీనిని ఒక విభాగంలో చేర్చనున్నారు. అయితే.. దీనిని 9వ తరగతి పాఠ్యాంశంగా చేర్చనున్నట్టు ఎన్సీ ఈఆర్టీ గుర్తించింది. సర్ ప్రక్రియను అత్యంత కీకలమైంది.
సర్ ప్రక్రియలో ఏం చేస్తారు? ప్రజాలు ఏం చేయాలి? ఈ పాఠ్యాంశంలో కూడా ముఖ్యమైన అంశాలు. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడం ద్వారా… న్యాయమైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న విషయాన్ని ఈ పాఠ్యాంశంలో పేర్కొన్నారు. అదేసమయంలో నకిలీ ఓటర్లు, దొంగ ఓట్లను తొలగించి.. ప్రజాస్వామ్య పునాదులను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారని ఉంది. దీనిని విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఏర్పడింది.
అదేసమయంలో విపక్షాలు చేసిన ఆరోపణలు, సర్ ప్రక్రియపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు కూడా పాఠ్యాంశంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు ఎన్సీఆర్టీ వివరించింది. ఇక, కేంద్ర ఎన్నికల సంఘంపై సర్ విషయంలో వచ్చిన ఒత్తిళ్లు, న్యాయప్ర‐ సుప్రీంకోర్టు తీర్పులు.. ప్రజాల క్రియ అభిప్రాయం పారదర్శకత.. వంటివాటికి కూడా ఈ పాఠ్యాంశంలో ప్రాధాన్యం కల్పించారు. ఎన్నిక ల సంఘం ఎంతో సవాల్‌గా నిర్వహించిన ఈ ప్రక్రియకు చారిత్రక ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు.
ఏడాది పూర్తి!
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ ప్రారంభ దేశంలో ఏడాది పూర్తయ్యింది. ముందుగా గత ఏడాది(2025) బీహార్‌లో సర్ ప్రక్రియను రూపొందించారు. అప్పట్లో ఎన్నికలకు ముందు నిర్వహించిన ఈ సర్ ప్రక్రియపై అనేక ప్రశ్నలు, అనుమానాలు కూడా తెరమీదికి వచ్చాయి. సుప్రీంకోర్టులో కూడా కేసులు దాఖలయ్యాయి. మొత్తంగా వాటిని అధిగమిస్తూనే.. మరోవైపు సర్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు తీసుకువెళ్లింది. ఆ రాష్ట్రంలో 65 లక్షల ఓట్లను తొలగించడం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ కొనసాగుతోంది.

