- మోదీపై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
- NEET బాధితులకు న్యాయం డిమాండ్
- యువతకు రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు
- వయోపరిమితి తగ్గించాలని తీర్మానం
ప్రధాని నరేంద్ర మోడీకి చెందిన ’56 ఛాతీ’ మళ్లీ యువశక్తి ముందు లొంగిపోయిందని, కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల నిరసన దెబ్బకు తలవంచక తప్పలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాడు సుదీర్ఘ పోరాటంతో రైతులు నల్ల చట్టాలను రద్దు చేస్తే, నేడు విద్యార్థుల ఆగ్రహంతో కేంద్ర విద్యాశాఖే విఫలమైందని. నీట్ (NEET) వివాదంలో నష్టపోయిన బాధితులందరికీ తక్షణమే న్యాయం చేయాలని, నిరసన తెలిపిన విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆకాంక్షనే ‘జై జవాన్, జై కిసాన్’ నినాదానికి జోడిగా ఇకపై ‘జై యువ’ నినాదం బలంగా వినిపిస్తుందని, ఈడీ, సీబీఐ, ఐటీ బెదిరింపులకు నేటి యువత ఎంతమాత్రం భయపడదని స్పష్టం చేశారు.
యువతకు రాజకీయ ప్రాబల్యాన్ని పెంచేందుకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే వయోపరిమితిని తగ్గించాలని కోరుతూ రాబోయే నెల ఉభయ సభల సమావేశాల్లో తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రత్యేక తీర్మానం సీఎం ప్రకటించారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల కనీస వయస్సు 21కు, అలాగే ఎమ్మెల్సీ, రాజ్యసభ అభ్యర్థుల వయస్సును 25 తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయించారు. కేంద్రం రాబోయే రోజుల్లో తీసుకరాబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లతో పాటుగా ఈ పోటీ వయోపరిమితి తగ్గింపు బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

