విశాలాంధ్ర అనంతపురం టౌన్ : జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఈ మేరకు…బుధవారం వీక్లీ పరేడ్లో భాగంగా స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఏఆర్ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక యోగా సెషన్ నిర్వహించారు. ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా మరియు ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం ఒత్తిడితో కూడిన విధులను నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కోసమే ఈ ప్రత్యేక యోగా శిక్షణను ఏర్పాటు చేశారు. ఈ యోగా సెషన్లో ఏఆర్ సిబ్బందికి అనుభవజ్ఞులైన యోగా నిపుణులలో సిబ్బందికి పలు రకాల ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానంపై అవగాహన కల్పించడం, వారితో యోగాసనాలు చేయడం వంటివి జరిగాయి. ఒత్తిడి: రోజువారీ విధుల్లో ఎదురయ్యే తీవ్రమైన మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది మరియు మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో దోహదపడుతుంది.
ఆరోగ్య సంరక్షణ: సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల క్రమం తప్పకుండా యోగాసనాలు చేయడం ద్వారా అధిగమించిన రోగాన్ని వివరించారు. పనితీరు మెరుగుదల: యోగా వల్ల పోలీస్ సిబ్బందిలో ఏకగ్రత, క్రమశిక్షణ పెరిగి, వారి విధి నిర్వహణ మరింత మెరుగవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు ఏఆర్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

