ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారం ఉత్పత్తికి రంగం సిద్ధమైంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారం ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఏర్పాటైన దేశంలోనే తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
వెయ్యి కిలోల ఉత్పత్తి లక్ష్యంగా…
అలాగే ఈ ప్రాంతంలోనే రెండో యూనిట్ కు శంకుస్థాపన చేస్తారు. కాగా రూ.320 కోట్లతో ఈ ప్లాంట్ ను నిర్మించారు. మొత్తం 1,477 ఎకరాల్లో బంగారం తవ్వకాలు చేపట్టనున్నారు. భూమి లోపల రెండు వరకు బంగారం నిక్షేపాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఏటా వెయ్యి కేజీల గోల్డ్ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
వార్తల సారాంశం – ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బంగారు ఉత్పత్తికి వేదిక సిద్ధమైంది

