వైభవ్ సూర్యవంశీ : సచిన్ కంటే చిన్న వయసులోనే టీమ్ ఇండియాలోకి అడుగుపెట్టాడు వైభవ్ సూర్య వంశీ. తన పేరు మీద ఎవరు ఇప్పట్లో బద్దలు కొట్టలేని రికార్డును సృష్టించుకున్నాడు. వైభవ్ సూర్య వంశీ కి రికార్డులు కొత్త కాదు. ఘనతలు కూడా కొత్త కాదు. తను ఏమిటో అండర్ 19 వరల్డ్ కప్ లో తెలిసింది. ఐపీఎల్ లో తెలిసింది. తాజాగా శ్రీలంక వేదికగా జరిగిన ట్రై సిరీస్ లో కూడా తెలిసింది. లెజెండ్ సినిమాలో.. బాలకృష్ణ.. నీకు నరుకుతుంటే అలుపు వస్తాదేమో.. నాకు ఊపు వస్తుంది.. అని జగపతిబాబును ఉద్దేశించి అంటాడు కదా.. క్రికెట్లో సూర్య వంశీ బ్యాటింగ్ కూడా అలానే ఉంటుంది. అన్ని రకాల బంతులు వేసి బౌలర్లకు అలుపు వస్తుందేమో.. కానీ కొడుతుంటే మాత్రం అతడికి ఊపు వస్తుంది. ఐపీఎల్ లో అదే కదా అతడు చూపించింది..
తాజాగా ప్రస్తుతం జరుగుతున్న టి20 సిరీస్లో రెండో మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగు పెట్టాడు సూర్య వంశీ. అత్యంత చిన్న వయసులోనే టీమ్ ఇండియాలో ప్రవేశించిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. తొలి మ్యాచ్లో అతడు కేవలం 14 పరుగులు మాత్రమే చేయగలడు.. కానీ ఆర్చర్ బౌలింగ్లో కొట్టిన సిక్సర్ ఎప్పటికీ మర్చిపోరు. అతడు ఒళ్ళు విల్లులాగా వంచి కొట్టిన తీరుకు ఆర్చర్ కూడా ఫిదా అయిపోయాడు. కేవలం పది బంతుల్లోనే అతడు 14 పరుగులు చేసినప్పటికీ.. ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ.. సూర్య వంశీ మీద అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. పైగా అతడు సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
సూర్య వంశీ కి ఇప్పటికే మిలియన్లలో ఫ్యాన్స్ ఉన్నారు. వారంతా కూడా సోషల్ మీడియాలో అతడిని గుర్తించారు. సోషల్ మీడియాలో ఇప్పటివరకు కేవలం తన ఫోటోలు మాత్రమే పెట్టేవాడు సూర్య వంశీ. తొలిసారిగా ఒక పోస్ట్ పెట్టాడు. అది ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం దున్నేస్తోంది…”మీ ద్వారా వస్తున్న సందేశాలు నన్ను ఉద్వేగానికి గురిచేస్తున్నాయి. వాటిని చూసి నేను తన్మయత్వానికి గురవుతున్నాను. అది నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. మీ అందరికీ నా ధన్యవాదాలు” అంటూ సూర్య వంశీ తన స్టా స్టోరీలో కూడా ఉన్నారు.
1989లో సచిన్ టెండూల్కర్ 16 సంవత్సరాల 205 రోజుల వయసులో చోటు సంపాదించాడు. పాకిస్థాన్ జట్టుతో టెస్ట్ ఆడి సరికొత్త రికార్డు సృష్టించాడు. మళ్లీ ఇన్ని సంవత్సరాలకు ఆ రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. 35 సంవత్సరాలుగా చెక్కుచెదరని విధంగా ఉన్న సచిన్ రికార్డును అతడు బ్రేక్ చేశాడు. 10 సంవత్సరాల 99 రోజుల వయసులో వైభవ్ సూర్య వంశీ జాతీయ జట్టులోకి ప్రవేశించాడు.


