- ఎల్లుండి కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
- రేపు ఖర్గే, రాహుల్‌గాంధీతో డీకే.శివకుమార్ భేటీ
- మంత్రివర్గ కూర్పుపై చర్చ
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బుధవారం ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు వేగంగా పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం డీకే.శివకుమార్, సిద్ధరామయ్య ఢిల్లీలో మకాం వేశారు. సోమవారం రాత్రి కేసీ.వేణుగోపాల్‌ను కలిశారు. రేపు ఉదయం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో డీకే.శివకుమార్ సమావేశమై మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్నారు.
కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత డీకే.శివకుమార్ ఢిల్లీలో పనిచేయడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం మంత్రివర్గ కూర్పుపై ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కుల సమీకరణలతో పాటు ఉప ముఖ్యమంత్రుల సంఖ్యపై చర్చించనున్నారు. అలాగే తదుపరి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అలాగే కుల సమీకరణాలను కూడా దృష్టిలో పెట్టుకుని కూర్చునట్లుగా చూపుతున్నారు.
డీకే.శివకుమార్ కేబినెట్లో భారీగా ఉండొచ్చని. తదుపరి ఎలక్షన్‌కు తగినట్టుగా మంత్రివర్గ కూర్పు జరగవలసిన సమాచారం. ఇక సిద్ధరామయ్య తన అనుచరులకు పెద్ద పీట వేయాలని కోరుతున్నారు. డిప్యూటీ సీఎం పోస్ట్‌తో కీలక మంత్రి పదవులు కోరుతున్నారు. ఈ మేరకు హైకమాండ్‌తో చర్చిస్తున్నారు.

