విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో తొట్టతొలి హైడ్రోజన్ రైలు సాకారం!. 2004-14 మధ్య అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హైడ్రోజన్ రైలును తీసుకురావాలని ప్రణాళిక చేసింది. కానీ, సాకారం కాలేదు. ఆ తర్వాత పగ్గాలుచేపట్టిన మోడీ.. కేవలం 5 సంవత్సరాల్లోనే హైడ్రోజన్ రైలు సాకారానికి నడుంబిగించారు. తాజాగా ఈ రైలు అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం ప్రధాన మంత్రి మోడీ.. హరియాణాలో తొలి నమో హైడ్రొజన్ రైలును ప్రారంభించనున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ అనుకూల వాహన వినియోగం పెరుగుతోంది. ఈ క్రమంలో మన దేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, వాయుకాలుష్యం తగ్గించాలన్న ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు 2030 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. లోపల భాగంగానే దేశవ్యాప్తంగా ఇటు వ్యక్తిగత, అటు ప్రజా రవాణా వ్యవస్థల్లోనూ.. ఎలాక్ట్రిక్ సహా.. హరిత ఇంధన వినియోగ వాహనాలను ప్రోత్సహిస్తోంది.
దేశవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా వినియోగించే అతి పెద్ద ప్రజారవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలు, పాలిత ప్రాంతాలను కలుపుతూ.. నడిచే రైళ్లలో.. ప్రస్తుతం విద్యుత్, డీజిల్ వంటి సంప్రదాయ ఇంధనాన్ని వినియోగిస్తున్నారు. అయితే.. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం హరిత ఇంధన రైళ్లను ప్రవేశ పెట్టాలని సంకల్పించింది. భాగంగా భాగంగా దేశంలోనే తొలిసారిగా శుక్రవారం తొలి హరింత ఇంధన హైడ్రోజన్ రైలుకు ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టనున్నారు.
హరియాణాలోని జింద్- సోనిపట్ మధ్య తొలి హైడ్రోజన్ రైలు శుక్రవారం ప్రయాణించనుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు. అత్యంత శక్తివంతమైన ఈ హైడ్రోజన్ రైలును ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ పరికరాలు, సాంకేతికతతో నిర్మించారు. పర్యావరణానికి ఎలాంటి హానీ కలగని రీతిలో ఈ రైలును రూపొందించడం విశేషం.
డీజిల్, బొగ్గు వినియోగానికి బదులు.. పునరుత్పాదక ఇంధనంతో తయారుచేసిన హైడ్రోజన్‌ను ఈ రైలులో ఇంధనంగా వినియోగిస్తారు. దీనికిగాను ప్రత్యేక హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. హైడ్రోజన్ వినియోగంతో ఎటువంటి కర్బన ఉద్గారాలు విడుదల కావని రైల్వే శాఖ గుర్తించింది. ఇక, ఈ రైలు గరిష్ఠంగా గంట 110 వేగంతో ఉండేలా రూపొందించబడింది. మొత్తం 10 బోగీలతో నిర్మించిన నమో హైడ్రోజన్ రైలుకు కేంద్ర ప్రభుత్వం 136 కోట్ల రూపాయ’లను ఖర్చు చేసింది. హైదరాబాద్‌కు చెందిన సంస్థ దీనిని రూపొందించడం విశేషం.
దేశంలో తొలి హైడ్రోజన్ రైలు రాకతో.. ఇప్పటి వరకు ఇలాంటి రైళ్లు ఉన్న కొద్ది దేశాలు సరసన భారత్ సగర్వంగా నిలవనుంది. ఇప్పటివరకు అభివృద్ధి చెందిన దేశాలైన జర్మనీ, జపాన్, చైనాలలోనే హైడ్రోజన్ రైళ్లు ఉండటం గమనార్హం. కాగా.. ఇప్పుడు మన దేశంలోనూ హైడ్రోజన్ రైలు అందుబాటులోకి రానుంది. ఇది పూర్తిగా మోడీ ఖాతాలోనే పడనుంది. అందుకే.. మోడీని విశ్వగురు అంటున్నారంటూ.. బీజేపీ ప్రశంసలు గుప్పించడం గమనార్హం. కాగా, త్వరలోనే దేశవ్యాప్తంగా మరిన్ని హైడ్రోజన్ రైళ్లను ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

