ప్రజల నుండి ఫిర్యాదులు అందిస్తే కఠిన చర్యలు తప్పవు..
మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య.
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత అని, ప్రజల ఫిర్యాదులు అందితే సంబంధిత ఉద్యోగులపై, కార్మికులపై కఠిన చర్యలు తప్పవు అని మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని వార్డు శానిటేషన్, పర్యావరణ కార్యదర్శులతో సీజనల్ వ్యాధుల నివారణపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన ప్రముఖులు, లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, చెత్తను తొలగించడం, కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టడం లాంటివి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని కోరారు. ఎక్కడ ఎటువంటి అపరిశుభ్రత ఉండదని, అలా అని సమాచారం అందితే మేస్త్రీలు శానిటరీ ఇన్స్పెక్టర్లు వేలు వెంటనే చర్యలు తీసుకోక తప్పదని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఉమామహేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్ సన్, మేస్త్రీలు ఉన్నారు.

