హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గాంధీ భవన్ లో పాలాభిషేకంపై నిషేధం విధించింది. పాలాభిషేకాలు చేయడం, జేసీబీలు వాడి నాయకులకు గజమాల వేయడంపై కూడా నిషేధం విధించింది. ఈమేరకు గురువారం (జులై 16) పార్టీ శ్రేణులు, నాయకులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్.
కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి కార్యక్రమమైనా, ఏ వేదికైనా పాలాభిషేకాలు, జలాభిషేకాలు చేయొద్దని మీనాక్షి నటరాజన్. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని.
పార్టీలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకు, వ్యక్తి పూజలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూచించబడింది.

