ఏటా 2 లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని బిఆర్ఎస్ ఎంఎల్ఎ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నేతలు పళ్ల కార్తిక్ రెడ్డి, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, తలసాని సాయికిరణ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ కే. వాసుదేవ రెడ్డి, కె. కిషోర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మాట్లాడారు. ఈ నెల 18న సరూర్‌నగర్ స్టేడియంలో వేలాది మంది యువత ‘యువ సంగ్రామ సదస్సు’తో ఆయన ప్రకటించారు. సరూర్‌నగర్‌లో కాంగ్రెస్ పెట్టిన యూత్ డిక్లరేషన్‌లో ‘సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు’ ఇస్తామని చెప్పి యువత, విద్యార్థులను రెచ్చగొట్టారని.
ఉద్యోగాలు, ఫీజు రియిస్మెంట్ పేరుతో మోసం గుర్తింపుంబర్. బిఆర్ఎస్ హయాంలో 2 లక్షల 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, 10 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు.’కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్‌రెడ్డి మెడకు ఉరి తాడుగా మారిందని అన్నారు.యువత, విద్యార్థులు తమ బలం చూపించాలని అన్నారు. పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్పై విషం చిమ్ముతోందని ఆరోపించారు. కాంగ్రెస్ హామీలను యువతకు గుర్తుచేయడానికే ఈ సదస్సు అని అన్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ 50 లక్షల నిరుద్యోగ కుటుంబాలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాయని, అయితే ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో సిఎం, మంత్రులకే క్లారిటీ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి యువత సిద్ధంగా ఉన్నారని అన్నారు. తలసాని సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ దొంగ హామీలను ఎండగడతామన్నారు.

