టి ఎన్ టి యు సి పార్లమెంట్ అధ్యక్షుడు నాగభూషణం
విశాలాంధ్ర ధర్మవరం;రాష్ట్రవ్యాప్తంగా మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడి కేంద్రాలుగా మార్చడం అని, మొదటి విడుదల 4685 రెండో విడతగా 340 కేంద్రాలను మార్చడం జరిగిందని, దీనికి ప్రధాన కారణం శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడి సంధ్యారాణి ముఖ్యంగా నారా లోకేష్ సూచనల మీదుగా కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ఆమోదం పొందే కార్యక్రమం రాష్ట్రంలో తెలుగు నాడు అంగన్వాడి బలోపేతంగా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా చేసింది మేమే అని కొన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు నుండి 5000 నుండి 11500 వరకు వసూలు చేయడం దారుణమని. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడం టీఎన్టీయూసీ పార్లమెంటు అధ్యక్షులు నాగభూషణం తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ స్పందించిమాట్లాడుతూ మంత్రులు లోకేష్ బాబు ఉమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. కావున ఏ ఒక కార్యకర్త ఎలాంటి డబ్బులు ఇవ్వకూడదు అని, సంఘాల పేరుతో ఎవరైనా బెదిరిస్తే సంబంధిత అధికారులకు తెలియజేయాలని తెలిపారు. టిఎన్టియుసికి అనుబంధంగా ఉన్న తెలుగు నాడు అంగన్వాడి యూనియన్ సభ్యులకు తెలియజేయాలని తెలిపారు.కావున లేకుంటే వసూళ్లకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా చర్యలు చేపడతామని ఇంకా ఒక ఎంక్వైరీ కమిషన్ను కూడా వేస్తామని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కావున ఎవరూ ఇలాంటి బెదిరింపులకు భయపడకుండా మా దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. కార్యక్రమంలో టి ఎన్ టి యు సి ధర్మవరం పట్టణ చిల్లా బొట్టుకృష్టప్ప, మరస సాయి, లింగమయ్య, రాజప్ప నిర్వహించారు.

