సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఇరాన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడుతుందని ప్రపంచం ఆశిస్తున్న తరుణంలో మరోసారి గల్ఫ్ భగ్గుమన్నది. ఇరాన్ దాడులతో ఘోర విధ్వంసం మళ్లీ మొదలైంది. శనివారం (జూన్ 06) బ్రహ్రెయిన్, కువైట్ దేశాలపై ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడటంతో ఒక భయానక యుద్ధవాతావరణం ఏర్పడింది.
కువైట్, బహ్రయెన్ టార్గెట్ గా ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైళ్లను విజయవంతంగా అడ్డుకున్నామని బహ్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా గల్ఫ్ సరిహద్దు దేశాలపై దాడులు ఆపేయాలని హెచ్చరించినట్లు బహ్రెయిన్ ప్రదర్శించారు.
హార్బూజ్ జలసంధి వైపు ఇరాన్ పంపిన మిస్సైళ్లు, డ్రోన్లను అడ్డుకున్నట్లు అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వార్త వచ్చిన తర్వాత గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడటం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ఇరాన్ మిస్సైళ్లను పడగొట్టే పనిలో ఉన్నామని కువైట్ మిలిటరీ ప్రకటించింది.
ఒకవైపు సీజ్ ఫైర్, శాంతి చర్చలు అంటూ అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో ప్రస్తుత దాడి ఆందోళన కలిగించే అంశం.
►ఇంకా చదవండి | అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పటికీ జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే: UNOలో పాకిస్తాన్‌కు ఇండియా కౌంటర్
ఇప్పటికే చర్చలు జరుగుతుండగా ఇజ్రాయెల్.. గాజాపై దాడులకు దిగడం చర్చలకు అన్యాయం జరిగింది. చర్చలు ఏమీ అన్నట్లుగా ఇరాన్ లైట్లు లేవు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. ఒకవైపు యుద్ధం ఆపేందుకు, హార్మూజ్ తెరిపేందుకు తాము ప్రయత్నిస్తే.. ఇజ్రాయెల్ చర్యతో మళ్లీ మొదటికొచ్చింది.. నెతన్యాహుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మళ్లీ చర్చలు మొదలవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇరాన్ రాడార్లు లక్ష్యంగా అమెరికా దాడులు చేయగా.. ఇదే అదనుగా ఇరాన్ గల్ఫ్ లో మరోసారి రెచ్చిపోయింది. బహ్రెయిన్, కువైట్ లాంటి దేశాలపై ఇరాన్ భీకర దాడి చేసింది.
🚨 బ్రేకింగ్ న్యూస్:
కువైట్‌లోని చమురు సౌకర్యాలపై ఇరాన్ భారీ సమ్మెను ప్రారంభించింది
నివేదికల ప్రకారం, కువైట్ చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మరో భారీ వైమానిక దాడి చేసింది. షాక్‌వేవ్‌లను పంపుతున్న ఈ దాడి ఇప్పటివరకు జరిగిన అత్యంత ముఖ్యమైన సమ్మెలలో ఒకటిగా వర్ణించబడింది… pic.twitter.com/WWmUJiANRM
— ఇరానియన్ ఫోర్స్ (@MrImranPk) జూన్ 6, 2026

