తెలంగాణ:నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో రైతులు,ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొండమల్లేపల్లిలోని డీఈఈ (డివిజనల్ ఇంజనీర్) ఆఫీస్ ముందు భారీ ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ( BRS Party )అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్,(మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ )పార్టీ రాష్ట్ర నాయకులు కేతవత్ భీల్య నాయక్,పార్టీ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్,చందంపేట మాజీ ఎంపీ ముత్యాల సర్వయ్య యాదవ్,కౌన్సిలర్ ముత్యాల రవికుమార్ యాదవ్,గుండాల వెంకట్ యాదవ్,పార్టీ రాష్ట్ర నాయకులు,కార్యకర్తలు,రైతులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు.

