– ప్రకటన –
నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం కోకాపేటలోని మూవీ టవర్స్ అపార్ట్ మెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు క్రమంగా అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్లకు వ్యాపించే అవకాశం లేకపోలేదు.. అపార్ట్ మెంట్ వాసులు భయంతో బయటికి పరుగులు తీశారు. సి – బ్లాక్ లోని సెల్లార్ మంటలు చెలరేగడంతో.. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమివ్వగా.. ఫైరింజన్లు ఘటనలో చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. కాగా.. షార్ట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా. ఏరియా పోలీసులు ఇప్పటికే ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
– ప్రకటన –

