చైనాలో గొర్రెల కాపరుల జీతం: శీర్షిక చదివి ఆశ్చర్యపోతున్నారా.. గొర్రెలు కాస్త నెలకు 1.1 లక్షలు ఇవ్వడమేంటి అని అనుకుంటున్నారా.. మీరు ఎలా అనుకున్నా సరే మీరు చదివింది నూటికి నూరు శాతం నిజం. కేవలం జీతం మాత్రమే కాదు.. వసతి కల్పిస్తారు. ఇంకా కొన్ని రకాల ప్రయోజనాలు కూడా అందిస్తారు.. నేటి కాలంలో పెద్ద పెద్ద చదువులు చదివారు.. గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నా స్థిరత్వం లేకుండా పోతుంది. పైగా కంపెనీలు అడ్డగోలుగా తీసివేయడంతో ఉద్యోగం అనేది ఎండ మావిలాగా మారిపోతుంది. ఉద్యోగం కోల్పోవడం వల్ల జీవితానికి ఆర్థిక స్థిరత్వం లేకుండా పోతుంది.
ఇటువంటి విపత్కర పరిస్థితిలో గొర్రెలు కాసే వాళ్లకు ప్రతినెల 1.1 లక్షలు ఇవ్వడం అంటే మాటలు కాదు. అయితే ఈ స్థాయిలో వేతనం ఇస్తున్నది మనదేశంలో కాదు. మన పక్కనే ఉన్న చైనాలో. చైనా దేశంలో గొర్రెల కాపరులకు విపరీతమైన డిమాండ్ ఉంది. అందువల్లే అక్కడ గొర్రెలను కాయడానికి ప్రతినెల 1.1 లక్షలు వేతనంగా ఇచ్చేందుకు ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. దానికి సంబంధించిన ప్రకటనను అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త విపరీతంగా సర్కులేట్ అవుతుంది. ఇప్పటికే ఆ ప్రకటన కోట్లలో వ్యూస్ సొంతం చేసుకుంది.
చైనా దేశంలో జూవో జియోవో యాంగ్ అనే వ్యక్తికి విస్తారంగా గొర్రెలు ఉన్నాయి. అయితే వాటిని మేపడానికి కాపరులు కావాలి. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాపరులుగా పని చేయడానికి ఇద్దరు వ్యక్తులు కావాలని అతడు సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు. కాపరులుగా పని చేసే వ్యక్తులకు ప్రతినెల 1.1 లక్షలు వేతనంగా ఇస్తానని.. వసతి కూడా కల్పిస్తానని ప్రకటించాడు. అతడు చేసిన ప్రకటన విపరీతంగా చర్చకు దారితీసింది. అంతేకాదు చాలామంది తాము కాపరులుగా పని చేయడానికి ముందుకు వచ్చారు. ఇందులో పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కూడా ఉన్నారు. చివరికి గొర్రెల కాపరులుగా పని చేయడానికి సిద్ధమే ముందుకు వస్తున్నారు. అయితే భారీగా దరఖాస్తులు రావడంతో.. వారు కాసేపట్లో పనిలోకి తీసుకున్న తర్వాత జీవో చెబుతుండటం విశేషం.
గొర్రెల పెంపకం ద్వారా జీవో భారీగా సంపాదిస్తుంటాడు. గొర్రెల మాంసంతో పాటు వాటి వెంట్రుకలను కూడా విక్రయిస్తుంటాడు. చైనాలో గొర్రెల మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందుకే జీవో భారీగా గొర్రెలను సాకుతూ ఉంటాడు. ఇతడికి భారీ ఎత్తున ఉన్నాయి గొర్రెల ఫామ్ లు.

