విశాలాంధ్ర, ఉరవకొండ: ఉరవకొండ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 గొర్రెలు మృతి చెందడంతో లారీ డ్రైవర్‌పై గొర్రెల కాపరులు దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.దీంతో ఆగ్రహానికి గురైన గొర్రెల కాపరులు లారీ డ్రైవర్ తమిళనాడుకు చెందిన గోవిందరాజుపై దాడి చేసి గాయపరిచారు. సమాచారం అందుకున్న ఉరవకొండ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన డ్రైవర్‌ను ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

