నవతెలంగాణ-మద్నూర్
99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాలిలో భాగంగా బుధవారం మోగా గ్రామంలో గ్రామసభ జరిగింది. ఈ సందర్భంగా హాలే బస్వంత్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధే సర్పంచ్‌గా పనిచేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. నాకు ఇతర ఏ ఆశలు లేవని అన్నారు. డబ్బు సంపాదించాలనే కోరికతో సర్పంచ్ గా పోటీ చేయలేదని చెప్పారు. సర్పంచ్ గా గెలిపించిన గ్రామస్థులకు రుణపడి ఉంటానని అన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యల పరిష్కారానికైనా ప్రజలు గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడితే సమస్య పరిష్కారం కాదని అన్నారు. కార్యదర్శికి గానీ, నాకు గానీ రాతపూర్వకంగా సమస్యను తెలపాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రతి సమస్య పరిష్కారానికి శిక్షణ వంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు. అనంతరం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులు ప్రజలకు వివరించారు. అధికారులు, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ప్రస్తుతం ఉన్నారు.
పోస్ట్ గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా: సర్పంచ్ మొదట కనిపించింది నవతెలంగాణ.

