చక్కెర తినడం మానేయండి…! ఇది చాలామంది సలహా. చాలామంది చక్కెర తినడం పూర్తిగా మానేశారు కూడా. తాగాలి, షుగర్ వ్యాధి ఉన్నవారు చక్కెర తినడం మానేయాలని వారు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు సూచిస్తున్నారు.అయితే… షుగర్ పూర్తిగా మానేయడం మంచిది కాదని ఓ పరిశోధనలో తేలింది. చికాగోలో జరిగిన ఎండోక్రైన్ సొసైటీ వార్షికోత్సవ సమావేశం ENDO 2026 లో ఒక రీసర్చ్ లో సబ్మిట్ చేసిన శరీరానికి బొత్తిగా సుక్రోజ్ అందకపోవడం వల్ల గట్ హెల్త్ దెబ్బ తింటుందని.. జీర్ణ సమస్యలు వస్తాయని తేలింది.
ఎలుకలపై చేసిన ప్రయోగంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. చక్కెర పూర్తిగా మానేస్తే మెటబలిజంపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే కోణంలో ప్రయోగం చేశామని… అధిక చక్కెర వినియోగం వల్ల కొన్ని రకాల చక్కెరలను పూర్తిగా తొలగించడం వల్ల ముఖ్యమైన జీవక్రియలకు కూడా అంతరాయం కలగదని తేలింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫ్రీ షుగర్స్ (ఆహారాలకు జోడించిన చక్కెరలు మరియు తేనె, సిరప్లు, పండ్ల రసాలలో సహజంగా ఉండేవి) మీ మొత్తం రోజువారీ ఆహారంలో 10 శాతం కంటే తక్కువగా ఉంటే, 5 శాతం కంటే తక్కువ తీసుకోవడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు.
స్టడీలో తేలింది ఇది:
కొన్ని ఎలుకలను రెండు గ్రూపులుగా విభజించి 16 వారాల పాటు జరిగిన ఈ పరిశోధనలో.. ఒక గ్రూప్ ఎలుకలకు సుక్రోజ్ ఉన్న ఫ్యాట్ ఫుడ్స్ అందించారు.. మరో గ్రూప్ ఎలుకలకు ఏమాత్రం సుక్రోజ్ లేని ఫ్యాట్ ఫుడ్ అందించారు. ఈ ప్రాసెస్ షుగర్ ప్రభావం తెలుసుకునేందుకు ఎలుకలకు గ్లూకోజ్ రెసిస్, ఇన్సులిన్ సెన్సిటివిటి వంటి టెస్ట్ లు చెప్పారు.
అయితే… సుక్రోజ్ లేని ఫుడ్ ఇచ్చిన ఎలుకలలో పెద్దగా మార్పు లేకపోగా మెటబాలిజంలో మార్పు కనపడిందని పరిశోధకులు.సుక్రోజ్ తీసుకోని ఎలుకల బ్లడ్ షుగర్ లెవెల్స్ సరిగా లేకపోవడం, ఇన్సులిన్ వ్యాధి పెరగడం, గట్ మైక్రోబయోమ్‌లో అంతరాయాలు, వాపు, ఫ్యాటీ లివర్ వ్యాధితో ముడిపడిన మార్పులు కనిపించాయని చెప్పారు.
తక్కువ కొవ్వు ఉన్న ఆహారం నుండి సుక్రోజ్‌ను పూర్తిగా తొలగించడం వలన పేగు ఆరోగ్యం ఊహించని విధంగా దెబ్బతిని, వాపు, జీవక్రియ లోపాలు ఏర్పడినట్లు చెబుతున్నారు. కేవలం చక్కెరను తొలగించడం కంటే పోషణ చాలా ముఖ్యమని అంటున్నారు.
గట్ హెల్త్ ప్రాధాన్యత:
గట్ మైక్రోబయోమ్ అంటే జీర్ణవ్యవస్థలో నివసించే ట్రిలియన్ల కొద్దీ కనిపించే, శిలీంధ్రాలు మరియు ఇతర సూక్ష్మజీవులు. ఈ సూక్ష్మజీవులు జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, జీవక్రియ, మొత్తం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఊబకాయం, మధుమేహం, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్, ఇంకా కొన్ని మానసిక ఆరోగ్య సమస్యల వంటి దీర్ఘకాలిక వ్యాధులను నిరోధించడం, పేగులోని వ్యాధిని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో అత్యవసరం అని నిపుణులు చెబుతున్నారు. సుక్రోజ్‌ను పూర్తిగా తొలగించడం ఈ సున్నితమైన పనితీరును దెబ్బతీయడం స్టడీలో తేలింది.
చక్కెర ఆహారం తీసుకున్న ఎలుకలలో పేగులోని సూక్ష్మజీవుల సంఖ్యలో మార్పులను పరిశోధకులు గమనించారు. ఈ అంతరాయాలతో పాటు పేగులు, కాలేయంలో వాపు కూడా పెరిగిందని పరిశోధకులు., ఈ రెండు మెటబాలిజంపై ప్రభావం చూపుతున్నట్లు చెబుతున్నారు. కాబట్టి షుగర్ పూర్తిగా మానేయకుండా…, నిపుణులు సూచించినట్లు తగిన మోతాదులో తీసుకుంటే మంచిది.

