ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు : ఏపీ రాజకీయాలు ఎప్పుడు కూడా గుంటూరు మిరపకాయ లాగా ఘాటుగా ఉంటాయి. రాజకీయ ఒక విషయం మీద ఏదో ఒక సమావేశంలో ఉంటారు.. అందులో కాస్త అవే నాయకులు చర్చలు జరుగుతుంటాయి. ఆ తర్వాత వేరే విధంగా బయటికి వస్తుంటాయి. అవి బయటకు వచ్చిన తర్వాత విశ్లేషకులు తమ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అక్కడ జరిగింది మొత్తం తాము చూసినట్టు.. తమ సమక్షంలోనే చెబుతుంటారు. ఫలితంగా అసలు వాస్తవం పక్కకు వెళ్తుంది. చివరికి ఊహాగానం ప్రచారంలో ఉంటుంది.
ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్. నాదెండ్ల మనోహర్ మంత్రిగా కొనసాగుతున్నారు. వీరిద్దరూ రాజకీయ అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అక్కడ ఏం జరిగింది అనేది వీరి ముగ్గురికి తెలిసి ఉంటుంది. కొన్ని అంతర్గత విషయాలు కూడా చర్చకు వచ్చినట్లు. అంత పెద్ద విషయాలు ఏ నాయకుడు కూడా బయటకు చెప్పడానికి ఇష్టపడడు. కొన్ని విషయాలు మాత్రమే విలేకరులతో చెబుతారు.. ఆ తర్వాత వెళ్ళిపోతారు. ఒకవేళ విలేకరులకు బలమైన పబ్లిక్ రిలేషన్ ఉంటే లోపల ఏం జరిగిందో తెలుసుకుంటారు. ఆ తర్వాత దానిని వార్తగా ప్రచురిస్తారు. జనంలోకి తీసుకెళ్తారు. కానీ కొంతమంది విశ్లేషకులు మీకు నచ్చింది చెబుతారు. వారికి తోచింది వాగుతుంటారు. ఇప్పుడు ఏపీలో అమిత్ షా, నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ భేటీపై ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇలానే మాట్లాడారు.
పవన్ కళ్యాణ్, మనోహర్, అమిత్ షా భేటీలో జగన్ అరెస్ట్ గురించి చర్చ వచ్చిందని.. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ కోరినట్లు.. దానికి అమిత్ షా నో చెప్పినట్టు.. జగన్మోహన్ రెడ్డిని లాంగ్ టర్మ్ పొలిటికల్ ఫ్రెండ్ అని అమిత్ షా చెప్పినట్టు.. దానికి పవన్ కళ్యాణ్ కూడా తల ఊపినట్టు.. ఇలా చెప్పుకుంటూ వెళ్లిపోయారు ప్రొఫెసర్ నాగేశ్వర్. వాస్తవానికి ఇలాంటి విషయాలు యవనిక మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడితే వాటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని అంచనా వేయలేక నాగేశ్వర్ ఏదో ఒకటి మాట్లాడేసారు. ఇప్పుడు అది ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. నాగేశ్వర్ మాట్లాడిన మాటలను వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుంది. రకరకాల ప్రచారాలు చేయడం మొదలుపెట్టింది.
నాగేశ్వర్ వ్యాఖ్యల తర్వాత ఏపీ మంత్రి మనోహర్ స్పందించారు. ఆయన అలా మాట్లాడటం దురదృష్టకరమని. అసలు అక్కడ జరిగింది ఒకటని.. నాగేశ్వర్ చెప్పింది ఒకటని.. జగన్ అరెస్ట్ గురించి అక్కడ ప్రస్తావన రాలేదని మనోహర్ క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ సోషల్ మీడియా.. మీడియా రకరకాల ప్రచారాలు చేస్తున్నాయి. అందువల్లే విశ్లేషకులు ఒక పార్టీకి వత్తాసు పలకకూడదు. తమకు తోచినట్టు మాట్లాడకూడదు. నిజం తెలిస్తే బయటపెట్టాలి. లేకుంటే నిశ్శబ్దంగా ఉండాలి. అటు ఇటు కాని విధంగా మాట్లాడితే చివరికి ఆ ప్రభావం రాష్ట్ర ప్రయోజనాల మీద.. ప్రజల మీద ఉంటుంది. ఈ విషయం ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వ్యక్తులకు తెలియకపోవడం నిజంగా బాధాకరం.
ఈ మధ్య వయసు పెరిగే కొద్దీ ప్రొఫెసర్ నాగేశ్వర్ లో అప్పట్లో ఆయన భావజాలం అంతా మళ్లీ బయటకొస్తోంది. కమ్యూనిజం భావజాలం.. కాంగ్రెస్ సెక్యూలరిజం కలగలిపి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడమే పనిగా పెట్టుకున్నారని ఈ మధ్య కొందరు కౌంటర్లు కూడా ఇస్తున్నారు. అయినా కూడా ఈ మేధావి నాగేశ్వర్ తన పంథా అసలు మార్చుకోవడం లేదు. బీజేపీపై నరనరాన వ్యతిరేకతతో అటు మోడీపై ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇటు బీజేపీతో పొత్తులో ఉన్న పార్టీలను ఆడిపోసుకుంటున్నాడు. నిజానికి అమిత్ షాతో భేటీలో పవన్, నాదెండ్ల తప్ప ఎవరూ లేరు. అక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏ కెమెరా కానీ.. వాయిస్ మైక్ కానీ పెట్టలేదు. కానీ అక్కడ ఉన్నది.. తనకు చెవిలో చెప్పినట్టుగా అన్నీ కల్పిత కథనాలతో నాగేశ్వర్ తెలుగు ప్రజల మెదళ్లలోకి విషం చిమ్ముతున్నారు. పెద్దాయన.. పెద్దమనిషి.. పైగా మేధావి ముసుగు అని నాదెండ్ల మనోహర్ గట్టిగా మాట్లాడలేదు కానీ.. ఇలానే ఆడిపోసుకుంటే నాగేశ్వర్ పెద్దరికానికి ఎప్పుడో ఎసరు రావడం ఖాయం.. అయినా నోరుమంచిదైతే ఊరు మంచిది అవుతుందని అంటారు. ఆ విషయం గ్రహించి తెచ్చుకున్న పెద్దరికం తగ్గట్టు ప్రొఫెసర్ గారు మారితే బెటర్ అని చాలా మంది చెబుతున్నారు. వింటే ఆయనపై విమర్శల వాడి తగ్గుతుంది.. వినకుంటే బయట ఈగల మోత పెరుగుతుంది..

