జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగానే జలమండలి జీఎం కుమార్ సంపాదించినట్లు ఈ సోదాల్లో కనుగొన్నారు.
హైదరాబాద్ లోని మల్లాపూర్ లోని కుమార్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఒక గేటెడ్ కమ్యునిటీలో 9 ఫ్లాట్లు పేర్కొన్నాయి. ఇంకా స్థిరాస్థులు కూడా ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. నిజామాబాద్ లో మూడు ఎకరాల వ్యవసాయ భూమిని పేర్కొన్నారు. ఈ దాడుల్లో కుమార్ నివాసంలో 1.10 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారని, సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు.

