సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు
విశాలాంధ్ర ధర్మవరం; జూలై 11వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ ను పోలీసులు సమన్వయంతో కృషి చేసి విజయవంతం చేశారు సీనియర్ సివిల్ జడ్జ్ చైర్మన్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపుల్ జూనియర్ సివిల్ జడ్జ్ చైర్మన్ వెంకటేశ్వర్లు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ వెంకట హరీష్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రాజశేఖర్. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో ఉదయం న్యాయవాదుల బార్ అసోసియేషన్ కమిటీ, సభ్యులు, సీనియర్ జూనియర్ న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం పోలీస్ అధికారులు, కోర్టు డివిజన్లోని ఆయా పోలీస్ స్టేషన్లలో ఎస్ఐఐ కానిస్టేబుల్‌తో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ జాతీయ మెగా అదాలకు విజయవంతం చేయడంలో పోలీస్ శాఖ, న్యాయవాదులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. కక్ష దారులతో న్యాయవాదులు రాజీకి వచ్చే కేసులను మాత్రమే చేపట్టాలని చెప్పారు. అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా తమ కక్ష దారులు లోకదాలతో అవగాహన కల్పించి విజయవంతం కావడానికి తమవంతు కృషి ఎంతో అవసరమని తెలిపారు. కేవలం రాజీకు తగ్గ కేసులు మాత్రమే లోక్ అదాలత్ లో రావాలని, ఎక్సైజ్, బ్యాంకు, భార్యాభర్తల తగాదా, ఎడారి తగాదా, ప్రామిస్రీ నోట్ కేసులు లాంటివి రాజీకు తగ్గ కేసులు మాత్రమే ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్స్ స్టేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణతో పాటు కమిటీ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, వివిధ పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది ఉన్నారు.

