ఏపీ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఐఆర్) ప్రక్రియలో ఇంకా 27,93,334 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాల డిజిటైజేషన్ పూర్తి కాలేదు. ఎన్నికల సంఘం అధికారిక ప్రకారం, వీరిలో 27,86,205 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు ఇప్పటికే పంపిణీ చేయబడినప్పటికీ, వారు సమర్పించిన వివరాల డిజిటల్ రూపంలో నమోదు చేసే ప్రక్రియ ఇంకా పెండింగ్లో ఉంది.
మరో 7,129 మంది ఓటర్లకు ఇప్పటికీ ఎన్యూమరేషన్ పత్రాలు అందించలేకపోయారు.
అధికారుల సమాచారం ప్రకారం, ఓటర్లు తమ చిరునామాల్లో లేకపోవడం, నమోదైన ఫోన్ నంబర్లు పనిచేయకపోవడం లేదా సంప్రదించినా స్పందించకపోవడం వల్ల పత్రాల పంపిణీ సాధ్యపడలేదు.
రెండు రోజుల సమయం మాత్రమే..
ఈ పత్రాలను అందించడం,ఓటర్లు నింపిన పత్రాలను తిరిగి స్వీకరించడం,వాటిని పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటైజేషన్ పూర్తి చేయడం కోసం ఇక రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.
ఇప్పటికే పంపిణీ చేసిన పత్రాల్లో తిరిగి అధికారులకు అందాయనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లలో 4,16,20,565 మందికి, అంటే 99.98 శాతం మందికి, ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేసిన ఎన్నికల సంఘం.
వీరిలో 3,88,34,360 మంది (93.29 శాతం) తమ వివరాలు నింపిన పత్రాలను బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) తిరిగి పొందారు. ఆ పత్రాల డిజిటైజేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది.
90 శాతం దాటిన ఎన్యూమరేషన్ పత్రాల డిజిటైజేషన్
అయితే ఇప్పటికే పంపిణీ చేసిన పత్రాల్లో 27,86,205 పత్రాల డిజిటైజేషన్ మాత్రమే ఇంకా పెండింగ్లో ఉంది. వీటిలో అధిక భాగం పట్టణాలు, నగర ప్రాంతాలకు చెందిన ఓటర్లవేనని అధికారులు చెబుతున్నారు. నిర్ణయించిన గడువులోపు దాదాపు 20 నుంచి 21 లక్షల మంది ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి అందే అవకాశం ఉందని అనధికారికంగా అంచనా వేస్తున్నారు.
అయితే డబుల్ ఎంట్రీలు, మరణించిన ఓటర్లు, గుర్తించలేని(యుఅసిశ్రీశ్రీశ్రీశ్రీవక్టబ్శ్రీవ)కేసులు,శాశ్వతంగా వలస వెళ్లిన వారు వంటి వర్గాలకు చెందిన ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి వచ్చే తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాల వారీగా చూస్తే విశాఖపట్నం, ఎన్టీఆర్, నెల్లూరు, నంద్యాల జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో ఎన్యూమరేషన్ పత్రాల డిజిటైజేషన్ 90 శాతం దాటింది.
జులై 14లోగా ఎన్యూమరేషన్ పత్రం సమర్పించాలి
ఈ నాలుగు జిల్లాల్లో కూడా దాదాపు 89 శాతం వరకు డిజిటైజేషన్ పూర్తయింది. మిగిలిన ప్రక్రియను వచ్చే రెండు రోజుల్లో పూర్తి చేయడానికి ప్రత్యేక డ్రైవ్ చేస్తారు. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యూమరేషన్ పత్రాలను జులై 14లో తప్పనిసరిగా బీఎల్వోలకు సమర్పించాలి. నిర్ణీత గడువులోపు పత్రాలు ఇవ్వని వారి పేర్లు జులై 21న ఎన్నికల సంఘం విడుదల చేస్తే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉండకూడదు.
దీనితో ఓటు హక్కుపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇంకా ఎన్యూమరేషన్ పత్రం సమర్పించిన ఓటర్లు వెంటనే తమ ముందున్న బీఎల్వోను సంప్రదించాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే 2002 నాటి ఓటర్ల జాబితా వివరాలు, తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల వివరాల ఆధారంగా మ్యాపింగ్ చేసి పూర్తి చేయడానికి బీఎల్వోలు సహాయం చేస్తారు. ఆన్లైన్లో వివరాలను సమర్పించడానికి ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ లేదా zpuuI చీజుT యాప్ ద్వారా కూడా తమ ఎన్యూమరేషన్ వివరాలను నమోదు చేసుకోవచ్చు.

