తెలంగాణ:రంగారెడ్డి జిల్లాలో(రంగా రెడ్డి జిల్లా) ఓ ఎస్ఐ వ్యవహారం వివాదంగా మారింది.రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై తన ఆరేళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, చిన్నారితో కారు నడిపించడంతో రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది,బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ విషయంపై కొందరు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయగా, సంబంధిత ఎస్ఐ “నా…నన్ను అడగడానికి మీరెవరు?” అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ ఘటనపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న పోలీసు అధికారి స్వయంగా వాటిని ఉల్లంఘించడం తగదని అభిప్రాయపడ్డారు.
ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

