బెంగళూర్: కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. 2026, జూన్ 3వ తేదీన కర్ణాటక 25వ సీఎంగాకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూర్ లోక్ భవన్ గ్లాస్ హౌస్‌లో జరగనున్న ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు, రాష్ట్ర సీనియర్ నాయకులు, కేబినెట్ సహచరులు, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా
కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. షేరింగ్ ఒప్పందంలో భాగంగా హైకమాండ్ మేరకు ఆయన పవర్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. గవర్నర్ కూడా సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు. దీనితో డీకే శివకుమార్‌కు కర్ణాటక సీఎం పగ్గాలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది.
సీఎల్పీ భేటీ నిర్వహించి డీకేను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ని కోరనున్నారు. 2026, జూన్ 3వ తేదీ నుంచి కర్ణాటక రాజకీయాల్లో నూతన అధ్యాయం ప్రారంభం.

