కుంభ రాశిలో జన్మించిన వారికి జూలై నెల సగటు ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ రాశి వారి ప్రణాళిక వేసుకున్న పనులను పూర్తి చేయడానికి అదనపు కృషి, శ్రమ చేయవలసి ఉంటుంది. చిన్న పనులకు కూడా చాలా పరుగులు పెట్టవలసి వస్తుంది అని పండితులు చెబుతున్నారు.
జులై నెలలో ఈ రాశి వారికి కుజుడు,సూర్యుడు ఈ నెల 7 తర్వాత బుధుడు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా ఘన విజయం సాధిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతికి బాగా అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.
కుటుంబ విషయాలతో జాగ్రత్తగా ఉండటం మంచిది. కొద్దిగా చికాకు కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు మీ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయవచ్చు, అదే సమయంలో మీ ఆదాయ వనరులలో అంతరాయాలు మానసిక క్షోభకు కారణం కావచ్చు. నెల ప్రారంభంలో గృహ సమస్యలు ప్రబలంగా ఉంటాయి. మీరు ఇంటికి వెళ్లవలసి ఉంటుంది లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఖచ్చితంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ కాలంలో మీరు నిరంతర శారీరక, మానసిక అలసటను అనుభవించవచ్చు.
వ్యక్తిగత ఉన్నతికి, యత్న కార్యసిద్ధికి అవకాశం ఉంది. వృత్తి జీవితం చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా అవ కాశాలు వస్తాయి. పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పిల్లలు చదువుల్లో కొద్దిగా వెనుకబడే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు కాస్తంత నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
చేయాల్సిన పరిహారాలు
- ప్రతిరోజూ వినాయకుడికి గరికతో పూజ చేయండి.
- పెరుగన్నం నైవేద్యం పెట్టండి.
- ఇంట్లో అనవసర గొడవలు .. ఆవేశం తగ్గడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి కుజ గాయత్రీ మంత్రం పఠించండి.
- ఏలినాటి శని చివరి దశలో ఆర్థిక నష్టాలు లేదా మాట పట్టింపులు రాకుండా శనివారం నాడు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి.
నిరాకరణ: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణులతో పాటు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని వినియోగించి రూపొందించారు. ఈ జాబితా V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించారు. మీకున్న వాస్తు, జ్యోతిష్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “జ్యోతిష్యం: కుంభరాశి వారికి జులైలో అదృష్టం వరిస్తుంది.. ఈ పరిహారాలు చేయండి..! “); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

