బుల్లి రాజు: అప్పుడప్పుడు మన తెలుగు సినిమాల్లో కొన్ని పాత్రలు హీరో పాత్రలను మించి హైలైట్ అవుతుంటాయి. ఎంతలా అంటే కేవలం ఆ పాత్రల కోసం ఆడియన్స్ రిపీట్ గా సినిమా థియేటర్స్ కి వెళ్లేంత. అలాంటి పాత్రల్లో ఒకటి బుల్లి రాజు. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో వెంకటేష్ కొడుకుగా ఈ బుల్లి రాజు పాత్రలో కనిపించారు మాస్టర్ రేవంత్. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా మారిపోయారు రేవంత్. ముఖ్యంగా తన హావభావాలతో, కామెడీ టైమింగ్ తో ఆ చిత్రం లో ఆయన పలికిన డైలాగ్స్ ఒక రేంజ్ లో పేలాయి. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ లో పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుకున్నారు. ఈ సినిమా తర్వాత రేవంత్ అలియాస్ బుల్లిరాజు కి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.
‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఈ బుడ్డోడు అనేక సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామిని సృష్టించిన ఈ సినిమాలో కూడా రేవంత్ కీలక పాత్ర పోషించిన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇకపోతే రీసెంట్ గానే అనిల్ రావిపూడి మొదలుపెట్టిన వెంకటేష్ – కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ చిత్రం లో కూడా రేవంత్ తీసుకున్నారట. అయితే ఆ బుడ్డోడి తల్లిదండ్రులు డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ని చూసి అనిల్ రావిపూడి కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేంత పని అయ్యిందట. ఒక్క రోజు కాల్ షీట్ కి లక్ష రూపాయిల చొప్పున రెమ్యూనరేషన్ అందించడానికి డిమాండ్ చేశారట. అత్యంత కీలక పాత్ర కాబట్టి అనిల్ రావిపూడి , నిర్మాత సాహు గారపాటి సినిమాలో నో చెప్పలేక ఒప్పుకున్నారట.
రోజుకు ఒక లక్ష రూపాయిలు అంటే స్టార్ కమెడియన్ రేంజ్ రెమ్యూనరేషన్ అన్నమాట. ఓవర్ లో ఈ బుడ్డోడికి వచ్చిన ఫేమ్ తో ఈ నైట్ రెమ్యూనరేషన్ అందుకే స్థాయికి వెళ్లిపోయారంటే, భవిష్యత్తులో ఈ బుడ్డోడు ఇంకా ఎంత పెద్ద స్థాయికి వెళ్తాడో అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈ బుడ్డోడి కాల్ షీట్స్ కోసం క్యూలు కడుతున్నారు. ఈ బుడ్డోడి అదృష్టం ఎలా ఉందంటే , పట్టిందల్లా బంగారం అనే రేంజ్ లో ఉంది. ఇప్పటి వరకు ఇతను చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి , ఇక అనిల్ రావిపూడి సినిమా ఎలాగో హిట్ కాబట్టి, ఈ బుడ్డోడి ఖాతాలో మరో సూపర్ హిట్ జమ అయినట్టే.

