భువనేశ్వర్ కుమార్: ఇటీవల జరిగిన ఐపిఎల్లో అత్యంత పొదుపుగా బౌలింగ్ వేశాడు భువనేశ్వర్. అదే స్థాయిలో వికెట్లు కూడా పడగొట్టాడు.. పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. భువనేశ్వర్ చాలా తక్కువగా మాట్లాడుతాడు. కానీ అతడు మాట్లాడినప్పుడు మీడియా మొత్తం సంచలనంగా మారుతుంది. ఎందుకంటే అతని మాటలు అలా ఉంటాయి కాబట్టి.
తాజాగా అతనికి చోటు ఎందుకు లభించడం లేదు.. తను ఎంత గొప్పగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ సెలెక్టర్లు ఎందుకు లెక్కలోకి తీసుకోవడం లేదు.. అనే విషయాలపై క్లారిటీ ఇచ్చాడు భువనేశ్వర్ కుమార్. “దేశం కోసం ఆడాలని చాలామందికి ఉంటుంది. అందులో నేను కూడా ఒకడిని. కాకపోతే కొన్ని సందర్భాల్లో జరిగిన విషయాలు బయట పెట్టుకోవడం భావ్యం కాదు. నేను నాకు నచ్చిన పని చేస్తున్నాను. అందులో నన్ను నేను నిరూపించుకుంటున్నాను. సెలెక్టర్లు వాళ్ల పని చేస్తున్నారు. టాలెంట్ ఉండగానే సరిపోదు. జట్టులోకి కూడా ఎంపిక కావాలి. జట్టులోకి ఎంపిక కావాలంటే దానిని సెలక్టర్లు చూసుకోవాలి.
భువనేశ్వర్ గతంలో జట్టుకు ఎంపికైనప్పుడు అద్భుతమైన ఇన్ స్వింగ్ బౌలింగ్ తో ఆకట్టుకునేవాడు.. తక్కువ ఎత్తులో బంతులు వేసి ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టేవాడు. ముఖ్యంగా వికెట్టు వికెట్ బంతులు వేయడంలో అతడి తర్వాత ఎవరైనా. తక్కువ వేగంతో యార్కర్లు వేసి.. వికెట్లు పడగొట్టడంలో భువనేశ్వర్ కుమార్ నేర్పరి. అందువల్లే అతడిని వికెట్ మాస్టర్ అని పిలుస్తుంటారు. ఇటీవల ఐపీఎల్లో బెంగళూరులో జుట్టు ఆడిన అతడు అదరగొట్టాడు. వికెట్ల మీద వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఇన్ని సంవత్సరాలపాటు ఐపీల్ ఆడుతున్నప్పటికీ.. కొత్త బౌలర్ లాగా బౌలింగ్ వేసి సంచలనం సృష్టించాడు.. ఐపీఎల్ ట్రోఫీ బెంగళూరు గెలవడం వెనక మిగిలిన పాత్ర ఎంతైతే ఉందో.. అంతకు మించిన పాత్ర భువనేశ్వర్ కుమార్ ది.
ఐపీఎల్లో సత్తా చూపించిన తర్వాత భువనేశ్వర్ కుమార్కు వన్డే సిరీస్లో అవకాశం ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. కనీసం ఐర్లాండ్, జట్లో జరిగే టీ20 సిరీస్ లకైనా చోటు లభిస్తుందేమోనని అనుకున్నారు. చివరికి అది కూడా వీలుపడలేదు. మొత్తానికి టన్నుల కొద్దీ టాలెంట్ పెట్టుకుని భువనేశ్వర్ జట్టుకు ఎంపిక కాలేకపోతున్నాడు.

