తెలంగాణ:యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం పరిధిలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ (మాజీ ఎమ్మెల్యే భూలు భిక్షమయ్య గౌడ్ )శుక్రవారం సందర్శించారు.నాగినేనిపల్లి,బొమ్మలరామారం,చీకటిమామిడి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వడ్లల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొల్పుతున్న జాప్యం,మౌలిక వసతుల కొరత, ‘తరుగు-తేమ’ పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే లిఫ్టింగ్ పూర్తి చేసి,రైతులకు చెల్లింపులు ఆలస్యం చేయకుండా వారం రోజుల్లోగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది.
రైతులు ఎన్నో కష్టాలుపడి పండించిన పంటకు సరైన ధర,సమయానికి చెల్లింపులు అందకపోతే తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బాల నరసయ్య,సర్పంచ్ జ్యోతిలు బీరప్ప,ఉమాదేవిశ్రీకాంత్,నాగరాజు,మాజీ సర్పంచులు ఆంజనేయులు,శ్రీనివాస్ గౌడ్,దామోదర్,వార్డు సభ్యులు,బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు.

