– ప్రకటన –
నవతెలంగాణ-డిచ్ పల్లి
ఇందల్ వాయి గన్నారం జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 1987-88 ఏడవ తరగతి అపూర్వ విద్యార్థులు కలిసి ఒకరి యోగ క్షేమాలను ఒకరు అడిగి తెలుసుకున్నారు. ఈ అపూర్వ కలయిక శుక్రవారం ఇందల్ వాయి నల్లవెల్లి పంచాయతీ పరిధిలోని తిరుమలయ్య ఆలయం వద్ద అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా దాదాపు 38 ఏళ్ళ తర్వాత కలుసుకోవడం ఎన్నో మధురానుభూతులను కల్గించిందని తెలియజేసారు. ప్రస్తుతం వీరిలో కొందరు రాజకీయ నాయకులు కాగా.. ఇంకొందరు, ఉద్యోగాల్లో, వ్యవసాయం, వ్యాపారం, డాక్టర్ గా చేస్తూ తమ కుటుంబాలతో సంతోషంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, తిర్మన్ పల్లి సర్పంచ్ ల కిషన్, డాక్టర్ సామల రాజేష్ లు పేర్కొన్నారు.
ఎప్పటి నుండో చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని అనుకున్నామని, అంతిమంగా ఒక్కొక్కరితో కలుస్తూ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు. ఎట్టకేలకు నేండ్ల తర్వాత అందరూ ఒకే చోట కలిసి సమ్మేళనం నిర్వహించుకోవడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. గతంలో చుట్టూ పక్కల గ్రామాల నుండి గన్నారం పాఠశాల వచ్చే వారమని 87-88లో గన్నారం పాఠశాల 7వ తరగతి వరకు ఉండేదని, నేడు అదే పాఠశాల 10వ తరగతి వరకు సంతోషదాయకమన్నారు. ఈ సమ్మేళనం లో చింతల కిషన్, డాక్టర్ సామల రాజేష్, లింగం, రాజేశ్వర్, స్వామి,వెంకటి, రాజలక్ష్మి,గిరీజ,విజయ నిర్మల కూడా ఉన్నారు. అనంతరం నూతనంగా సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా నియమితులైన చింతల కిషన్ కు ఘనంగా సన్మానించారు.
– ప్రకటన –

