కలెక్టర్ రాజబాబు
వలేటివారిపాలెం : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి సమస్యను పరిష్కరించడమే ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ పి. రాజబాబు పేర్కొన్నారు.శుక్రవారం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్ పి. రాజబాబు వలేటివారిపాలెం మండలం మండల పరిషత్ నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమ అనంతరం కలెక్టర్ పాత్రికేయులతో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో సుమారుగా 339 పైచిలుకు అర్జీలు అందాయి. ప్రభుత్వ సూచనల మేరకు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా శుక్రవారం నియోజకవర్గంలో మూడోసారి ఈ వలేటి వారిపాలెం మండలంలో నిర్వహించడం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో సమస్యలను పరిష్కరించడమే ముఖ్య ఉద్దేశం అన్నారు. అందిన అర్జీలను మండల అధికారులు మండల పరిషత్ అధికారులు ఆయా శాఖల జిల్లా అధికారులకు పంపడం జరిగింది. అజ్జిదారులతో మాట్లాడిన సమస్యల వివరాలను తెలుసుకోవడం జరుగుతుంది అని ఆయా శాఖల జిల్లా అధికారులు తగిన పూర్తి పరిష్కారం చూపుతారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. శుక్రవారం సాయంత్రం సమీర్ పేట లో పల్లెలో కార్యక్రమం నిర్వహించి స్థానిక సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు.స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరావు మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలో మూడుసార్లు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సుమారుగా 340 వరకు అర్జీలు అందాయని తెలిపారు. అందులో ఎక్కువగా రెవిన్యూ కి సంబంధించి 207 అర్జీలు అందాయని, 15 సచివాలయాలు 21 పంచాయతీలు ఉన్నాయని, అయితే వీఆర్వోల కొరత ఉందని ఆయన కలెక్టర్ దృష్టికి వచ్చారు. నియోజకవర్గంలోని వెనుకబడిన కరువు మండలాలకు అన్ని రకాల ఆదుకోవాలని ఆయన నిర్ణయించుకుంటారు. నియోజకవర్గంలో సమస్య పరిష్కరించాలని ఆయన జిల్లా కలెక్టర్ ని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, కందుకూరి సబ్ కలెక్టర్ హిమ వంశి, జిల్లా అధికారి వెంకటరమణ, జడ్పీ సీఈవో చిరంజీవి, డీపీఓ అనుపమ, బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వర్లు మరియు వివిధ శాఖల జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

