తెలంగాణ అన్న పదం దీక్షన’రీలోనే లేద’ని.. కొందరు ప్రాంతీయ వాదులు సృష్టించిన పదమని.. ఇటీవల తెలంగాణకు చెందిన కీలక టీడీపీ నాయకుడు బక్కని నర్సింహులు వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అనే పదం దీక్షనరీలో ఉందో లేదో ఆయన చూశాడా? అని ప్రశ్నించారు.
తెలంగాణ వాదులను, తెలంగాణ సమాజాన్ని ఎవరూ అవమానించడానికి వీల్లేద’ని.. ప్రాంతాలు వేరైన’ప్పటికీ.. తెలుగు వారు అంతా ఒక్కటేనని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. ఇలాంటి వ్యాఖ్ఖ్యలు చేయటం వల్ల.. ప్రజల మనోభావాలు దెబ్బ తినే పరిస్థితి వస్తోందని తెలిపారు.
పార్టీ పుట్టిందే అక్కడ!
తెలుగు దేశం పార్టీ.. పుట్టిందే తెలంగాణ గడ్డపై అని చంద్రబాబు గుర్తు చేశారు. 1982లో తెలుగు దేశం పార్టీని ఎన్టీఆర్ ప్రకటించారని.. అప్పటికి ఆయన హైదరాబాద్ గడ్డపైనే ఉన్న విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. తెలంగాణ కోసం టీడీపీ అనేక నిర్ణ యాలు తీసుకుంది.
పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దుచేసి.. తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించామన్నారు. అదేవిధంగా పలు ప్రాజెక్టులు నిర్మించి.. తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు తాగు, సాగునీటిని అందించిన ఘనత కూడా టీడీపీకే దక్కుతుందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ను ఎన్టీఆర్ అద్భుతంగా అభివృద్ధి చేసినందుకు ఇప్పుడు ఆ రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్‌కు కీలక పాత్ర ఉంది.
తన హయాంలో సాయిబరాబాద్ వంటి ఒక నగరాన్ని సృష్టించిన విషయాన్ని ప్రస్తావించారు. ఐటీ రంగానికి తెలంగాణను కేంద్రంగా మార్చామని.. ఇదే తెలంగాణ అభివృద్ధి కోసమే టీడీపీ ప్రభుత్వం నాడు అనేక నిర్ణ యాలు తీసుకుంది.
ఇప్పుడు తెలంగాణ గురించి కొందరు మాట్లాడారు.. ఆ రాష్ట్రాన్ని.. టీడీపీని కూడా అవమానించేలా వ్యవహరించడం సరికాదన్నారు. తెలంగాణ కూడా తెలుగు ప్రజల సొత్తేనని చెప్పారు. అందరూ కలిసి ఉన్నారని.. తర్వాత వద్దనుకుని విడిపోయారని అంతమాత్రాన.. తెలంగాణపై విమర్శలు చేయడం సరికాదని తెలిపారు. రాజకీయాలు వేరు.. ప్రజ’ల సెంటిమెంటు వేరు.
ఏం జరిగింది?
ఇటీవల నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో తెలంగాణ నుంచి కూడా టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో ఒకరిద్దరు మట్టాడుతూ.. తెలంగాణపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా నర్సింహులు.. తెలంగాణ అనే పదమే దీక్షనరీలో లేదని.. ఇది ప్రాంతీయ వాదులు తమ వ్యక్తిగత స్వార్థం కోసం తీసుకువెళ్లిన నినాదం.. కుటుంబాల కోసం పదవులు కట్టబెట్టుకున్నారని.. తెలంగాణ కంటే మెరుగైన స్థానంలో ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా టీడీపీని ఇరుకున పెట్టాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు తెలంగాణ నాయకులను ఉద్దేశించి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

