హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు విద్యార్థులకు మాత్రమే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఇస్తుంది.
వీబీ జీరామ్ జీ పథకం అమలుపై…
ఇకపై ఉపాధ్యాయులు, సిబ్బందికి కూడా అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా అందించాలని నిర్ణయించారు. అప్పుడే నాణ్యత కలిగిన అల్పాహారం, భోజనం విద్యార్థులకు కూడా అందుతుందని కేబినెట్ అభిప్రాయపడింది. మరొక వైపు తెలంగాణలో వీబీ జీరామ్ జీ పథకం అమలుపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ సమావేశంలో చర్చించారు. వీబీరామ్ జీ తెలంగాణలోజులై 1వ తేదీ నుంచి అమలు చేయడానికి కేబినెట్ నిర్ణయించింది.
వార్తల సారాంశం – తెలంగాణ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది

