Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. అందులో ప్రధానమైనది తిరుమల పింక్ డైమండ్. టిడిపి ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ పింక్ డైమండ్ కనిపించకుండా పోయింది అంటూ రమణ దీక్షితులతోపాటు అప్పటి వైసీపీ నేత విజయసాయిరెడ్డి. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. వారు ఆశించినట్టుగా పొలిటికల్ మైలేజ్ వచ్చింది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేలా అవాస్తవాలు ప్రచారం చేశారంటూ గతంలో 200 కోట్ల రూపాయల పరువు నష్టం దావా దాఖలైంది. ఈ కేసు విచారణ వేగవంతం అయింది. అందులో భాగంగా టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి క్రాస్ ఎగ్జామినేషన్ సక్సెస్‌గా పూర్తయింది. ప్రతివాదులుగా ఉన్న శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డిలకు చట్టపరంగా శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* ఎన్నికల్లో లబ్దికోసం..
2019 ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డి పక్కా వ్యూహం ప్రకారం వ్యవహరించారు. శ్రీవారి ఆభరణాల్లోని అత్యంత విలువైన పింక్ డైమండ్ మాయమైందని.. ఇది చంద్రబాబు నివాసంలో ఉందంటూ రమణ దీక్షితులు మీడియా సమావేశాలు పెట్టి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిని రాజకీయం జోడించి మరింత రక్తి కట్టించారు విజయసాయిరెడ్డి. అయితే స్వామివారి ఆభరణాలు భద్రంగా ఉన్నాయని.. టిటిడితను, భద్రతను దెబ్బతీసేందుకు పనికి కుట్రగా అభివర్ణించింది టీటీడీ. రమణ దీక్షితులతో పాటు విజయసాయిరెడ్డి పై 200 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది.
* కేసు నీరు గార్డ్చేందుకు ప్రయత్నం..
అయితే ఆ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందింది. అధికారంలోకి రాగలిగింది. అప్పట్లో ఈ కేసును నీరు గార్చేందుకు చాలా రకాలుగా ప్రయత్నించింది. అసలు శ్రీవారి వద్ద పింక్ డైమండ్ లేదు.. అది ఒక గులాబీ రంగు రాయి మాత్రమేనని అసెంబ్లీలో కూడా ప్రస్తావించింది. అప్పట్లో చేసిన ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసమేనని తేలిపోయింది. మరోవైపు 200 కోట్ల రూపాయల పరువు నష్టం దావాకు సంబంధించి టిటిడి నిర్వహణతో వెనక్కి తగ్గింది. కానీ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కావడంతో అది వీలుపడలేదు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో భాగంగా, క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసింది. తుది విచారణపై చర్యలు ప్రారంభం అయ్యాయి. దీంతో రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డిలు ఇరకాటంలో పడటం ఖాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

