రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అన్ని భాషలకు కలిపి 270 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కేవలం ఫారిన్ దేశాల్లో మాత్రమే కాదు , మన ఇండియాలో కూడా ఈ చిత్రం కళ్ళు చెదిరే వసూళ్లు నమోదు అవుతున్నాయి. వీకెండ్ తర్వాత వర్కింగ్ డే లో కూడా ఈ చిత్రం ఇండియా వైడ్ గా అద్భుతమైన ఆక్యుపెన్సీలు వచ్చాయి. మొదటి సోమవారం రోజున ఈ చిత్రం 7 కోట్ల 78 లక్షల రూపాయిల నెట్వసూళ్లు నమోదు అయ్యాయి. ఇది సాధారణమైన విషయం కాదు.
ఓవరాల్ గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 64 కోట్ల 58 లక్షల రూపాయల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇకపోతే ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన ప్రతీ నటినటులకు ఎంత మంచి పేరొచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో కీలక పాత్ర కోసం గతం లో ప్రముఖ హాలీవుడ్ హీరో ధనుష్ ని సంప్రదించారట మేకర్స్. ఆయన్ని ఏ పాత్ర కోసం సంప్రదించారో తెలియదు కానీ, క్రిస్టోనోలన్ టీం ‘ది గ్రే మ్యాన్’ చిత్రంలో ధనుష్ నటన చూసి , ఒక మంచి పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసం సంప్రదించారట. కానీ అప్పటికే తెలుగు , తమిళం , హిందీ అని తేడా లేకుండా ధనుష్ చేతినిండా సినిమాలతో బిజీ గా ఉన్నారు. దీంతో అయాన్ నోలన్ టీం అడిగినన్ని డేట్స్ కేటాయించలేకపోయారు. ఆ కారణం చేత ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న సినిమాలో ధనుష్ బంగారం లాంటి వదులుకున్నట్టు అయ్యింది. ఒకవేళ ఈ చిత్రం ఆయన ఒప్పుకొని చేసుంటే , ఆయన రేంజ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

