తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీకి మరో షాక్ తగిలింది. మరో రాజ్యసభ ఎంపీ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఎంపీ ప్రకాశ్ బరైక్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌కు తన రాజీనామాల లేఖను సమర్పించారు.
వరస రాజీనామాలతో…
ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత వరసగా రాజ్యసభ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలోనే రాజ్యసభకు ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయడం టీసీఐలో ఆందోళన రేపుతుంది. దీంతో రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ బలం పదికి తగ్గింది. మరికొందరు కూడా రాజీనామా బాటలో ఉన్నారని చెబుతున్నారు.

