మనతెలంగాణ/హైదరాబాద్: తాను దొరను కాదని, ప్రజల మధ్య నుంచి ఎదిగిన వ్యక్తినని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. కొంతమంది దొరలమని గొప్పలు చెప్పుకుంటారని, తనకు అలాంటి గొప్పలు అవసరం లేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను గుంపు మేస్త్రీనేనని, మా మంత్రుల గుంపుకంతా మేస్త్రీనేనని, ఎవరు అవహేళన చేసినా పట్టించుకోనని సిఎం రేవంత్ స్పష్టం చేశారు. తన గుంపులో ఉన్నవారంతా రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతున్నారని ఆయన అన్నారు. నా ఉద్యోగులు, నా ప్రజలే నా గుంపు అని ఆయన అన్నారు. ఈ గుంపే పేదలకు ప్రభుత్వానికి మధ్య వారధులమన్నారు. తాను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని, ఆయ కుటుంబాల్లో కష్టాలేలా ఉంటాయో తెలుసా అని ఆయన చెప్పారు. ఆనాడైనా, ఈనాడైనా తనను రేవంతన్న అని పిలిస్తేనే ఇష్టమని ఆయన పేర్కొన్నారు. పదవులు, హోదాలు మారొచ్చుగానీ ప్రజలతో తన అనుబంధం ఎప్పటికీ మారదని సిఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఒకప్పుడు తాను జడ్పీటీసీని, ఆ తర్వాత ఎంపీనని, ఇప్పుడు సిఎంనని, కానీ, తాను సిఎం కాకముందు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నానని, పదవులు ఎప్పుడూ శాశ్వతం కాదని, ప్రజల గుండెల్లో స్థానమే శాశ్వతమని, దొర కాదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే గత పాలనలో ఉద్యోగులకు ప్రతి నెల 10వ తేదీ వరకు కూడా జీతాలు అందని పరిస్థితి ఉండేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు మొదటి తేదీనే జీతాలిస్తున్నామని ఆయన చెప్పారు.
ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కెసిఆర్ పదేళ్లలో రూ.8 లక్షల 11 వేల కోట్లు అప్పులు చేసి దివాళా తీయించారని ఆయన అన్నారు. పదేళ్లలో వందేళ్ల విధ్వంసం సృష్టించారని ఆయన అన్నారు. ప్రతిరోజూ ఒక గంట అదనంగా పనిచేద్దామని ఉద్యోగులను సిఎం నిర్ణయించారు.రవీంద్రభారతిలో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బీమా రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం బ్యాంకులతో ఎంఓయూ ప్రారంభించింది. ఈ ప్రకటన అతిథిగా సిఎం రేవంత్ ముఖ్యరెడ్డి. రెగ్యులర్ ఉద్యోగులు సహా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులకు కూడా ఉచిత ప్రమాద బీమా కల్పించేలా సిఎం రేవంత్ రెడ్డి 16 బ్యాంకులతో ప్రభుత్వం తరపున ఎంఓయూ కుదుర్చుకొని, ఉద్యోగులు, పెన్షనర్ల ప్రమాద పథకానికి శ్రీకారం చుట్టారు. రవీంద్రభారతిలో ఆయా ఎంఓయూలపై సిఎం సంతకాలు చేశారు. బ్రతికి ఉన్నప్పుడు ఉన్న బంధాలు చనిపోయిన తరువాత సానుభూతిని మాత్రమే చూపిస్తుంది, ఆర్థికంగా ఆదుకునే వారు చాలా తక్కువని, ప్రమాదబీమా ఉద్యోగుల కుటుంబానికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసా ఇస్తుందని ఆయన అన్నారు. అందుకే ఉద్యోగులందరికీ ఇన్య్సూరెన్స్ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. పదవీ విరమణ తర్వాత కూడా ఉద్యోగులు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు పొందేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రమాద బీమా ద్వారా ఉద్యోగులకు రూ.కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకు కవరేజీ ఉంటుందని, విమాన ప్రమాదబీమాకు బ్యాంకులు రూ.2కోట్లు -రూ.3 కోట్ల బీమాను అందజేస్తున్నట్లు సిఎం వివరించారు.
45 మంది సింగరేణి కార్మికుల కుటుంబాలకు బీమా సాయం
మొదటగా సింగరేణి కార్మికులకు బీమా కల్పించేందుకు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ప్రతిపాదించినప్పుడు తనకు నమ్మకం కలగలేదని ఆయన చెప్పారు. ఒక్క రూపాయి చెల్లించకుండా కోటి రూపాయలు బీమా ఎలా సాధ్యమైన ప్రశ్న తలెత్తుతుందని, ప్రమాద బీమా తొలిసారిగా సింగరేణిలో ప్రారంభించామని, 45 మంది సింగరేణి కార్మికులకు బీమా బీమా సాయం అందించి ఈ బీమా అవకాశం కల్పిస్తామని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
పీఆర్సీ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం
ఇక, ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఉద్యోగుల నమ్మకమే ప్రభుత్వానికి కొండంత బలమన్నారు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారినా ఉద్యోగులు మాత్రం శాశ్వతంగా ఉంటారు. ప్రభుత్వానికి ఉద్యోగులే వారధులని, సారథులుగా ఉంటారన్నారు. చెప్పిన మాట ప్రకారం విడతల వారిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధులు విడుదల చేస్తున్నామని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. సమస్యలు మీకుంటే తన దృష్టికి తీసుకురావాలని చర్చించుకొని పరిష్కరించుకుందామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
30 నెలలుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు
ఆనాడు మేం అభివృద్ధి చేస్తే పోరాడితే ఇప్పుడు వాళ్లు వద్దే వద్దు అని ధర్నాలు, ఓట్లు వేయని ప్రజలు ఉంటే ఏమి లేకుంటే సిఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఊరిమీద పడి తిరుగుతున్నారని, ఫాంహౌస్ లో ఉంటే కుంభకర్ణుడు, బయటకు వస్తే బకాసురుడు అన్నట్లుగా వ్యవహారిస్తున్నారని, కొంచెమైనా వారికి కృతజ్ఞత ఉందా? అని సిఎం రేవంత్ రెడ్డి కూడా ప్రశ్నించారు.30 నెలలుగా ఒక్క రోజు తాను సెలవు తీసుకోలేదని, మేం రూపొందించిన ప్రణాళికలన్నీ ఇప్పుడు కొలిక్కి వస్తున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు.
ఢిల్లీలో ఏముంది ? కాలుష్యం ట్రాఫిక్ జామ్ తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా ఆయన పదే పదే ఢిల్లీకి వెళ్లేదని ఆయన అన్నారు.
మీ సమస్యలు తీర్చాలన్న ఆలోచనే తప్ప తనకు వేరే ఆలోచన లేదని సిఎం రేవంత్రెడ్డి చెప్పారు. తన రాజకీయ ప్రయాణంలో బాధ్యత పెరిగింది తప్ప, నా నడక, నడతలో ఎలాంటి మార్పు రా అవసరం.
చరిత్రాత్మక పథకం ఇది: డిప్యూటీ సిఎం
రాష్ట్రంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు భద్రత, భరోసా కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై కానీ, ఇటు ఉద్యోగులపై కానీ ఒక్క రూపాయి అదనపు భారం పడకుండా, బ్యాంకులతో మాట్లాడి ఈ బీమా రక్షణ కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ అద్భు తమైన బీమా పథకం ద్వారా సాధారణ ప్రమాదాల్లో మరణిస్తే రూ. కోటి 25 లక్షలు, అదే విమాన ప్రమాదం జరిగితే రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు బీమా పరిహారం అందుతుందని భట్టి విక్రమార్క వివరించారు. 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల ఉద్యోగులకు రూ. 10 లక్షల జీవిత బీమా రక్షణ ఉంటుందన్నారు. కేవలం సాధారణ ఉద్యోగులకే కాకుండా నెలనెలా ప్రభుత్వ రికార్డుల ద్వారా జీతం పొందే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులకు ఈ నివాసం వర్తింపజేస్తున్నట్లు డిప్యూటీ సిఎం ప్రకటించారు.

