ముంబై వరదలు : వర్షాకాలం వచ్చిందంటే చాలు ముంబై నగర వాసుల పరిస్థితి వెనిస్ నగరంలో ఉన్నట్టే. ఎందుకంటే అక్కడ వర్షాలు విపరీతంగా కురుస్తాయి. ముంబై నగరంలో ప్రతి వర్షాకాలంలో క్లౌడ్ బరస్ట్ పైగా అన్నట్టుగా వర్షాలు పడుతుంటాయి. ఈ వర్షాల వల్ల అక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించిపోతుంది. గత సంవత్సరాలతో పోల్చి చూస్తే ఈ సంవత్సరం వర్షాకాలం అక్కడ కాస్త ఆలస్యంగా మొదలైంది. అయినప్పటికీ భారీ వర్షాలు ఆ ప్రాంతంలో దంచి కొడుతున్నాయి. ఫలితంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుంది.
ఇటీవల ముంబై లోకల్ రైల్వే పట్టాల మీదికి వరద నీరు వచ్చింది. దీంతో లోకల్ రైళ్లు రద్దయ్యాయి. ముంబై కి శివారు ప్రాంతంలో వర్షాల వల్ల పర్వతప్రాంతాల నుంచి మట్టి కొట్టుకు వచ్చింది. రాళ్లు కూడా అడ్డంగా పడ్డాయి. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అక్కడ ఇప్పటికి సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముంబై నగరంలో కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే నడుములోకి వరదనీరు వచ్చి చేరింది. ఈ ప్రాంతంలో రాకపోకలు ఆగిపోయాయి.
చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయిలో వర్షాకాలం ఆస్వాదిస్తున్న నేపథ్యంలో ముంబై నగర వాసులు ఈ వరద నీటిని పెద్ద ఇబ్బందిగా అనుకోవడం లేదు. ఈ వరద నీటిలో ఈ త కొడుతున్నారు. ఆ వరద నీటిని స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. అందులో ఈత కొట్టి ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా సర్కులేట్ అవుతున్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ముంబై నగరంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వాస్తవానికి రుతుపవనాలు మనదేశంలో ప్రవేశించిన తర్వాత మహారాష్ట్రలో విపరీతంగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. అనుకూల వాతావరణం కనుక ఉండి ఉంటే మహారాష్ట్రలో సమృద్ధిగా వర్షాలు పడుతుంటాయి. అయితే ఈసారి రుతుపవనాల విస్తరణ ఆశించిన స్థాయిలో లేకపోవడం.. వాతావరణంలో మార్పులు స్పష్టంగా ఉండటంతో వర్షాలు కురవలేదు. అయితే ఆలస్యంగానైనా వర్షాలు మొదలు కావడం.. అవి కూడా రికార్డు స్థాయిలో వర్షపాతాన్ని నమోదు చేయడంతో మహారాష్ట్రలో ఒకప్పటి వాతావరణం కనిపిస్తోంది. దీనికి తోడు వర్షాల వల్ల ముంబై నగరం చాలావరకు తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఈ నీటిలోనే ముంబై నగరవాసులు ఈతకొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వర్షాకాలాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నారు. మొన్నటిదాకా తాము ఎండలతో ఇబ్బంది పడ్డామని.. ఇప్పుడు వర్షాలు కురుస్తుంటే ఆనందిస్తున్నామని చెప్పారు.

