కూకట్ పల్లి, వెలుగు: కూకట్ పల్లి ఆల్విన్ కాలనీ తులసీనగర్ శ్రీ లీలాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం ఆశ్చర్యకర ఘటన జరిగింది. గర్భగుడిలోని నరసింహస్వామి విగ్రహం చుట్టూ దాదాపు 10 అడుగుల నాగుపాము పడగ విప్పి దర్శనమిచ్చింది.
ఆలయం తెరిచేందుకు వెళ్లిన అర్చకులు ఈ దృశ్యాన్ని చూసి భక్తితో నమస్కరించారు. ఈ విషయం తెలియడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆ సర్పం అక్కడి నుంచి వెళ్లిపోయింది.

