విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని నాటు సారాయి తయారీదారులు, అక్రమ మద్యం అమ్మకాల దాడులపై అనంతపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ప్రసాద్ ప్రకారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరిపిన దాడుల్లో వేల్పుమడుగు క్రాస్ వద్ద ఈదుల ముష్ఠూరుకు చెందిన ఎస్.వెంకటేశులు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని నుంచి 08 మంది మద్యం బాటిల్స్‌ను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం కేసును నమోదు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేటప్పుడు ఇద్దరిపై కేసులు కట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ధర్మవరం రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు మాదక పదార్థాల గురించి అవగాహన కలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సైలు నాగరాజు, చాంద్ బాషా, సిబ్బంది ఉన్నారు.

