– ప్రకటన –
– విలువలతో కూడిన విద్యతోనే మంచి గుర్తింపు
– అత్యాధునిక వసతులతో స్కూల్ ఏర్పాటు అభినందనీయం
– ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి
– అమీన్పూర్లో గీతాంజలి స్కూల్ నూతన శాఖ ప్రారంభం
నవతెలంగాణ- అమీన్పూర్: అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సాయి రామ్ ఎంక్లేవ్ ఫేస్-2లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘గీతాంజలి పాఠశాల’ శాఖ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పటాన్చెరు నియోజకవర్గ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి విశిష్ట అతిథిగా ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ కలిసి రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాలను లాంఛనంగా చేశారు. పాఠశాలను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. వేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ ప్రాంతంలో అత్యాధునిక వసతులు, అంతర్జాతీయ ప్రమాణాలతో గీతాంజలి పాఠశాలను అందజేయడం పట్ల యాజమాన్యాన్ని అభినందించారు. ఇప్పటికే ఇస్నాపూర్ పరిధిలో నాణ్యమైన విద్యాబోధన అందిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ, ఇప్పుడు అమీన్పూర్లో మరో బ్రాంచ్ ప్రారంభించడం సంతోషకరమన్నారు. నేటి పోటీ ప్రపంచంలోని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు, వారికి ఉన్నతమైన విద్యను అందించడంలో ఈ కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ తల్లిదండ్రులు ఎంపీపీ దేవానంద్, మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, మాజీ కౌన్సిలర్ కొల్లూరి గోపాల్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఐలాపూర్ నరసింగరావు, అమీన్పూర్ ఎంఈవో సుధాకర్, పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, స్థానిక విద్యార్థులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
– ప్రకటన –

