ఆంధ్రప్రదేశ్:రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఈ నెల 27 వరకు ‘రైతన్నా.మీ కోసం’(‘రైతన్న మీ కోసం’) కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఎల్నినో ప్రభావం,నివారణ చర్యలు, పంటల ఎంపిక,ఎరువుల కొనుగోలు,వాడకంపై అవగాహన కల్పిస్తారు.నీటి భద్రత,డిమాండ్ ఆధారిత పంటల సాగు,అగ్రిటెక్,ఫుడ్ ప్రాసెసింగ్, పంచసూత్రాలపై అధికారులు రైతులకు వివరిస్తారు.

