యోగా మాస్టర్స్ దాసరి రామన్న, చార గుండ్ల నరేష్, ప్రభాకర్
విశాలాంధ్ర ధర్మవరం;; నేటి సమాజంలో యోగా ఎక్కువగా ఉందని ప్రతి మనిషి యోగాను అభ్యసించాలని యోగా మాస్టర్ దాసరి రామన్న, చారగుండ్ల నరేష్, ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని శివానగర్ మున్సిపల్ హైస్కూల్లో శివ సాయి యోగా సెంటర్లో వేసవి కాలంలో ఉచిత యోగ సమ్మేళనం నిర్వహించామని తెలిపారు. ఈ తరగతులు మే 31వ తేదీ వరకు నిర్వహించామని తెలిపారు. శిక్షణ ముగిసిన తర్వాత ప్రభుత్వం ద్వారా సర్టిఫికెట్లను పంపిణీ చేసింది. ఉదయము సాయంత్రం వేళల్లో ఈ శిక్షణ తరగతులు చేస్తామని, దీనికి విశేష స్పందన రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నిష్ణాతులైన యోగా మాస్టర్ల చేత సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశ్యంతోనే ఉచిత యోగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసు నుంచి ముసలి వయసు వరకు కూడా ఈ యోగా తమ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుందని తెలిపారు. ఈ శిక్షణ తరగతులలో ముఖ్యంగా ధ్యానము ప్రాణాయామము సూర్య నమస్కారాలు నేర్పించడమే కాకుండా కుటుంబం పట్ల గౌరవము, సామాజిక విలువలు, పెద్దలపట్ల వారి ప్రవర్తనా తీరు మొదలగు వాటికి కూడా శిక్షణ ఇవ్వబడింది. ప్రస్తుతం పట్టణంలోని ప్రభుత్వ పరిధిలోని కళాజ్యోతిలోని సాంస్కృతిక మండలిలో, శివానగర్లోని మున్సిపల్ హైస్కూల్లో, ఆర్టీసీ బస్టాండ్ యశోద కాన్సెప్ట్ స్కూల్లో మే 1వ తేదీ నుంచి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ సత్య సాయి జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గాజుల సోమేశ్వర్ రెడ్డి, సాంస్కృతిక మండలి అధ్యక్షులు సత్రశాల ప్రసన్నకుమార్, కార్యదర్శి సోలిగాళ్ళ వెంకటేశులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

