సియా కేతన్ కేసు: పూణే వ్యాపారవేత్త కేతన్ హత్య కేసుకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతోంది. కేతన్ ను పూణేకు చాలా దూరంలో ఉన్న ఒక కోట మీద నుంచి లోయలో పడి చనిపోయాడు. అతడు అలా చనిపోవడానికి కారణం సియా, ఆమె ప్రియుడు చేతన్. వీరిద్దరూ ఒక ప్రణాళిక ప్రకారం అతడిని చంపేశారు. గతంలో రెండు పర్యాయాలు అతడిని చంపడానికి ప్రయత్నించారు. అవి విఫలం కావడంతో.. చివరికి అతడిని ఆ కోట వద్దకు పిలిపించి.. లోయలోకి నెత్తివేసి చంపేశారు.
అతడిని చంపే ప్రణాళిక ఇద్దరు కలిసి రూపొందించారు. దారుణంగా లోయలోకి తోసివేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అంతేకాదు, కాబోయే భార్యలతో కూడా మగవాళ్లకు ఏ స్థాయిలో ప్రమాదం ఉందో ఈ సంఘటన నిరూపించింది. సియా, చేతన్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత.. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడిని చంపడానికి అనేక పర్యాయాలుగా వీరిద్దరూ ప్రణాళికలు రూపొందించారని.. కోటి రూపాయల వరకు వసూలు చేశారని.. మధ్యలో ఇంకొకరు సహాయం కూడా తీసుకున్నారని.. ఇలా రకరకాల నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు సీన్ రిక్రియేషన్ చేశారు. ఈ సందర్భంగా సియా మీడియా ప్రతినిధులను చూసి మిడిల్ ఫింగర్ చూపించింది. అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించింది. అయితే ఈ కేసులో ఇంకా కొన్ని నిజాలను బయటికి రాబట్టాల్సిన విచారణ అధికారులు సియా, పాలి గ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని భావించారు. అయితే ఈ ఇంటికి వారిద్దరూ ఒప్పుకుంటేనే నిర్వహించాలని కోర్టు పోలీసులకు సూచించింది. వారి దగ్గర నుంచి అంగీకారం కనిపించింది.. కోర్టు వారిద్దరిని 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడికి పంపించింది. వారిద్దరు ప్రస్తుతం ఎర్రవాడ జైల్లో ఉన్నారు.
పోలీసులకు దొరకకుండా పకడ్బందీగా వ్యవహరించారు. సియా ఏకంగా స్పై ఫోన్ ఉపయోగించింది. ఆ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ఎటువంటి సాంకేతిక ఆధారాలు లభించకుండా ఉండేందుకు వారిద్దరు కోడ్ భాష, రహస్య సంకేతాలను చాటింగ్ చేశారు.. ఈ విషయాలను గుర్తించిన పోలీసులు వాటిని డీకోడ్ చేసే పనిలో పడ్డారు. కోర్టు వారిద్దరి కస్టడీ పొడగించిన నేపథ్యంలో.. మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

