హైదరాబాద్: టిజి20 లీగ్ భాగంగా రంగారెడ్డి రైజర్స్, ఖమ్మం ఏసెస్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రంగారెడ్డి జట్టు బ్యాటింగ్ కోసం ముందుకొచ్చింది. ఈ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆదిత్య జవ్వాజి (43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జ్ఞాన రెడ్డి 36, నితిన్ సాయి యాదవ్ 19, తనయ్ త్యాగరాజన్ 14, ఆరవెల్లి అవనీష్ 12 పరుగులు చేశారు. ఖమ్మం బౌలర్లలో చామా మిలింద్ 3 వికెట్లు, హర్షిత్ సాయి వేద్ రెడ్డి చెరి 2, విద్యాానంద రెడ్డి, షేక్ అజహర్ చెరో వికెట్ తీశారు.

