విశాలాంధ్ర – పాయకరావుపేట : కాపు నాయకులు, దివంగత వంగవీటి మోహన్ రంగ 77వ జయంతి వేడుకలు పాయకరావుపేటలో కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగతా శ్రీనివాస్, నియోజకవర్గ అధ్యక్షులు కొమిరాల నాగార్జున, ఆంధ్ర, తెలంగాణ రాధా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ పాయకరావుపేట పట్టణ అధ్యక్షులు గొంతిన అనిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ రంగా విగ్రహానికి పూలమాల వేశారు. కేక్ కట్ చేశారు. రిటైర్డ్ ఆర్మీ నాయక్ పి.నర్సింహమూర్తి, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు గరికిన ప్రియాంక, కీర్తి జానకి దుర్గ లను ఘనంగా సన్మానించారు. పారిశుద్ధ్య మహిళ కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెదిరెడ్డి చిట్టిబాబు, టిడిపి మండల అధ్యక్షులు చించలపు ప్రదీప్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ తోట నగేష్, వైసిపి జిల్లా అధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయిబాబా, పిఇఎస్ఎస్ అధ్యక్షులు చిక్కాల జి ల్లా శ్రీనివాసరావు, మజ్జూరి నారాయణరావు, యాళ్ల సన్న బాబు, ధనిశెట్టి బుజ్జి, ధనశెట్టి సత్య మహేష్, జగవిత శ్రీనివాస్ సత్యనారాయణ, చిక్కాల శ్రీనివాసరావు జరిగింది.

