దేశంలో నేడు బక్రీద్ పండగ జరగనుంది. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో బక్రీద్ ను జరుపుకుంటున్నారు. త్యాగానికి, భక్తికి ప్రతీకగా నిలిచే పవిత్ర బక్రీద్ పండగను దేశంలోని ముస్లిం సోదరులు నేడు జరుపుకుంటున్నారు. మహమ్మద్ ప్రవక్త ఇబ్రహీం చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ పండగను ముస్లింసోదరులు జరుపుకుంటున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పేదలకు అన్నదానం చేస్తున్నారు.
బక్రీద్ సందర్భంగా నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో సెలవు దినంగా ప్రకటించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ముందుగా 27న బక్రీద్ అని ప్రకటించినప్పటికీ నెలవంక ఆలస్యంగా కనిపించడంతో ముస్లిం పెద్దల సూచన మేరకు బక్రీద్ ను ఈ నెల 28వ తేదీకి మార్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

