బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నిన్నటి వరకూ ధరలు తగ్గుతూ ఒకింత పసిడిప్రియులకు ఊరట కలిగించిన బంగారం మళ్లీ పరుగు అందుకుంది. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. బంగారం, వెండి వస్తువులకు డిమాండ్ లేకపోయినా ధరలు పెరుగుతున్నాయి.
నేటి ధరలు…
పది గ్రాముల బంగారం ధర పై రూ.320 పెరిగింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ.1,59,380కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగి రూ.1,46,610కి చేరింది. హైదరాబాద్లో కిలో వెండి ధర 2,95,000 రూపాయలుగా ఉంది.

