నోయిడా: నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం నోయిడాలోని మమురా గ్రామంలో ఎలక్ట్రిక్ వాహనాన్ని ఛార్జింగ్ చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. గ్రౌండ్-ఫ్లోర్ పార్కింగ్ దగ్గర చెలరేగిన ఈ మంటలు కళ్లు మూసి తెరిచే లోపే దగ్గర ఉన్న వాహనాలకు వ్యాపించాయి. బిల్డింగ్ మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ అగ్నిప్రమాదంలో దురదృష్టవశాత్తూ ఇద్దరు మరణించారు.
#చూడండి | నోయిడా సెక్టార్ 66లోని భవనంలో అగ్ని ప్రమాదం | DCP సెంట్రల్ నోయిడా ఇలా అన్నారు, “ఈరోజు, సెక్టార్ 66లోని మమూరా ప్రాంతంలో (ఫేజ్-3 పోలీస్ స్టేషన్ పరిధిలో), నివాస భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. దీని కోసం ప్లగిన్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ (EV)… https://t.co/TvpekYQGzz pic.twitter.com/K1Uu4uNjCa
– ANI (@ANI) జూలై 15, 2026
అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్‌లో దాదాపు 50 కుటుంబాలకు రెస్క్యూ టీం సురక్షిత ప్రాంతాలకు తరలించబడింది. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన స్పాట్‌కు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. నోయిడా సెక్టార్ 66లోని ఈ అగ్ని ప్రమాదం జరిగింది.
అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్‌ను G+4 నిర్మాణంగా పోలీసులు గుర్తించారు. అన్నీ 2BHK ఫ్లాట్లు. ప్రతీ ఫ్లోర్లో ఐదు కుటుంబాలకు అందించారు. అగ్ని ప్రమాదానికి కారణం ఏంటంటే పోలీసుల ప్రాథమిక విచారణలో ఏం తేలిందంటే.. ఎలక్ట్రిక్ వాహనాన్ని ఛార్జ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి.
ఒక్క నిప్పురవ్వ కారణంగా మంటలు అంటుకుని, అవి సమీపంలోని పెట్రోల్ వాహనాలకు వ్యాపించి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫేజ్-3 పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎలాంటి నిబంధనలు పాటించలేదు.. బిల్డింగ్ యజమానితో పాటు లీజుదారుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

